ఏపీలో వచ్చే ఎన్నికలతో వైసీపీని( YCP ) గద్దె దించాలని టీడీపీ, జనసేన పార్టీలు( TDP Janasena ) చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.అవసరమైతే ఈ రెండు పార్టీలు ఏకమై బీజేపీని( BJP ) కూడా కలుపుకొని వైసీపీకి అధికారం దూరం చేయాలని కంకణం కట్టుకున్నారు చంద్రబాబు పవన్ కల్యాణ్.
మరి నిజంగానే ఈ పార్టీలు ఏకమైతే వైసీపీని నష్టం తప్పదా అంటే అవుననే సమాధానం కొందరు చెబుతుంటే.ఎలాంటి ప్రభావం ఉండదని మరికొందరు చెబుతున్నారు.
ప్రస్తుతం వైసీపీపై అనుకూలత ఏ స్థాయిలో ఉందో వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉంది.వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో లబ్ది పొందుతున్న వారంతా జగన్ సర్కార్ పై సానుకూలంగానే ఉన్నారు.
అదే విధంగా ధరల పెరుగుదల, అవినీతి ఆరోపణలు, ఇసుక మాఫియా వంటి ఇతరత్రా కారణాలతో వ్యతిరేకత చూపుతున్న వారి సంఖ్యకూడా ఎక్కువగానే ఉంది.ఈ నేపథ్యంలో వైసీపీ వ్యతిరేక ఓటును చిలనివ్వకుండా చేస్తే జగన్ ను గద్దె దించవచ్చనేది టీడీపీ, జనసేన మాస్టర్ ప్లాన్.అందుకే ఈ పార్టీలు ఎప్పటి నుంచో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాయి.అధికారికంగా పొత్తులో లేనప్పటికి అనధికారికంగా ఈ రెండు పార్టీల మద్య అంతర్గత పొత్తు ఉందనేది జగమేరిగిన సత్యం.
అయితే ఈ రెండు పార్టీలకు ఇప్పుడు అసలు చిక్కంతా బీజేపీ నుంచే ఏర్పడుతోంది.ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ టీడీపీతో కలవడానికి విముఖత ప్రదర్శిస్తోంది.అయితే ఇదే ధోరణిలో ఉంటే జనసేన పార్టీ బీజేపీతో తెగతెంపులు చేసుకొని పూర్తిగా టీడీపీతో కలిసే అవకాశం ఉంది.అందుకే టీడీపీ జనసేన కూటమికి బీజేపీ తప్పనిసరిగా ఒకే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఈ మూడు పార్టీలు కలిస్తే వైసీపీకి లాభామా నష్టమా అనే దానిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.2014 సీన్ రిపీట్ అయ్యి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉందని కొందరు చెబుతుంటే.టీడీపీ జనసేన పార్టీలతో బీజేపీ కలిస్తే వైసీపీ కే లాభం అని మరికొందరు చెబుతున్నారు.ఇదే విషయాన్ని సిపిఐ నేత నారాయణ మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ కలిస్తే.
బీజేపీ వ్యతిరేక ఓటు చిలీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎందుకంటే బీజేపీ విధానలాపై చాలా మంది ప్రజాల్లో వ్యతిరేకత ఉంది.
ముఖ్యంగా క్రిష్టియన్, మైనారిటీ వర్గాల వారు బీజేపీకి దూరంగా ఉంటారు.ఈ నేపథ్యంలో వీరంతా కూడా మూకుమ్మడిగా వైసీపీకి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి.
అలాగే కేంద్రప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వారు సైతం కూటమిని కాదని వైసీపీని ప్రత్యామ్నాయం గా చూసుకుంటారు.కాబట్టి టీడీపీ, జనసేనతో బీజేపీ కలిస్తే.
ఆ కూటమికి నష్టమే తప్పా లాభం లేదనేది కొంతమంది నుంచి వినిపిస్తున్న మాట.