టిడిపి, బిజెపి, జనసేన ( TDP, BJP, Jana Sena )పార్టీలకు టికెట్ల కేటాయింపు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది .మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలను తప్పించి, వేరొకరికి సీటు కేటాయించడం, అలాగే పొత్తులో భాగంగా కేటాయించిన సీట్ల విషయంలోను వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ముఖ్యంగా జనసేన పార్టీ విషయాని కొస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం( Western Constituency ) టికెట్ కోసం ఆ పార్టీకి చెందిన కీలక నేత పోతిన వెంకట మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.ఎప్పటి నుంచో క్షేత్రస్థాయిలో ఆయన కష్టపడుతూ, పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు.
అధికార పార్టీ వైసిపిని టార్గెట్ చేసుకోవడమే కాకుండా, విజయవాడలో జనసేన బలోపేతానికి మహేష్ కృషి చేస్తున్నారు.అయితే టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ విషయంలో సందిగ్ధత ఏర్పడింది.
ఇక్కడ సీటు కోసం టిడిపి నుంచి జలీల్ ఖాన్, బుద్ధ వెంకన్నలు తీవ్రంగా పోటీ పడుతుండడంతో, ఈ నియోజకవర్గం పై ఆశలు పెట్టుకున్న జనసేన నేత మహేష్( Jana Sena leader Mahesh ) తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇదే విషయంపై పార్టీ పెద్దల నుంచి ఆయనకు సరైన సమాచారం లేకపోవడంతో, మహేష్ కాస్త అసంతృప్తితోనే ఉంటున్నారు.తనకు పశ్చిమ నియోజకవర్గ సీటును కేటాయించాల్సిందే అంటూ ఈ రోజు దీక్షకు దిగారు.పశ్చిమ నియోజకవర్గంలో తానే లోకల్ అని, తనకే సీటు కేటాయించాలి అంటూ మహేష్ దీక్షకు దిగారు.” కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం.గత ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి పని చేశాం.
నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారు.ఈ పశ్చిమ నియోజకవర్గంలో అణువణువు నాకు తెలుసు.
జనసేన పార్టీ తప్ప ఎవరికి సీటు ఇచ్చినా వైసీపీతో పోటీ పడలేరు.
ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampally Srinivas ) ను వేరే నియోజకవర్గానికి పంపించింది మా పోరాటం వల్లే.నాకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది.పవన్ కళ్యాణ్ రెండో లిస్టులో నా పేరు ఉంటుంది అని చెప్పారు.
అయన చెప్పడం వల్లే నా దూకుడు పెంచాను పశ్చి.మ నియోజకవర్గం ప్రజలు నాకు సీటు ఇవ్వడమే న్యాయమని అంటున్నారు ” అంటూ మహేష్ చెబుతున్నారు.
ఈ క్రమంలో పవన్ పోతిన మహేష్ చేపట్టిన దీక్ష విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.