మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్....

భారతజాతి గర్వపడే బిడ్డ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి అని మాజీ మంత్రి, హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కొనియాడారు.అటల్ బిహారి వాజ్ పేయి 97వ జయంతి సందర్బంగా మేడ్చల్ పట్టణంలో ఆయన భారీ విగ్రహాన్ని ఈటల రాజేందర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.

 Huzurabad Mla Etela Rajender Inaugurated Former Pm Bajpayee Statue Details, Huzu-TeluguStop.com

ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ గొప్ప త్యాగ శీలి, మానవతా మూర్తి వాజ్ పేయి ఆశయాలను భావితరాలకు సంకల్పంలో భాగంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు.మహనీయుల విగ్రహాలు, జయంతి ఉత్సవాలు వారి ఆశయాలు, త్యాగాలు రాబోయే తరాలకు అందించి సంకల్పం నెలకొల్పాలని ఈటల రాజేందర్ తెలిపారు.

వాజ్ పేయి జీవిత చరిత్ర భారతీయ జనతా పార్టీ కే కాకుండా యావత్ భారతావనికి గర్వకారణమని కొనియాడారు.భారత ప్రధానిగా ఉన్నప్పుడు అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల చేత శభాష్ అనిపించుకున్న ఏకైక నాయకుడు అటల్ బిహారి వాజ్ పేయి అన్నారు.

అలాంటి నాయకుడి విగ్రహాన్ని మేడ్చల్ లో పెట్టుకోవడం ఈ ప్రాంత ప్రజానికానికే కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గర్వకారణమని భావిస్తున్నామని ఈటల రాజేందర్ అన్నారు.ఈ సందర్బంగా విగ్రహ దాత కేశవరెడ్డిని, స్థల దాత సంతోష్ చారిని ఈటల రాజేందర్ ఘనంగా సన్మానించారు.

Telugu Biharibajpayee, Bajpayee Statue, Etela Rajender, Pm, Huzurabad Mla, Medch

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా రూరల్ బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కేశవరెడ్డి, లక్ష్మారెడ్డి, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు, తాళ్లపల్లి ఉపేందర్, సంతోష్ వేలూరి, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, అర్జున్, వంశీ, గాంధీ, బుద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube