ఇంటర్నెట్‌ లేకున్నా.. యూపీఐ పేమెంట్స్‌ ఎలా చేయాలో తెలుసా?

సాధారణంగా ఏవైనా చెల్లింపులు చేపట్టినప్పుడు ఇంటర్నెట్‌ స్లోగా ఉండటంతో పేమెంట్‌ చేయలేకపోతాం.దీంతో అది ఫెయిల్‌ అవుతుంది.2జీలో ఉంటే ఎటువంటి ఆన్‌లైన్‌ చెల్లింపులు చేయలేం.అయితే, చాలా మందికి యూపీఐ చెల్లింపులు ఆఫ్‌లైన్‌లో ఎలా పేమెంట్‌ చేయాలో తెలీదు.

 How To Make Online Payments Without Internet, Online Transactions, Upi Payments,-TeluguStop.com

మీ ఫోన్‌ ద్వారా *99# యూఎస్‌ఎస్‌డీ కోడ్‌ ద్వారా ఇది సాధ్యమవుతుంది.ఆ వివరాలు తెలుసుకుందాం.

ఈ *99# సర్వీస్‌లో అన్ని మొబైల్‌ యూజర్లకు సేవలనందించిందేకు పరిచయం చేశారు.స్మార్ట్‌ఫోన్‌ ఉన్నా లేకున్నా.ఈ సేవలు అందుకోవచ్చు.కేవలం మీ వద్ద ఉన్న ఫోన్‌ నంబర్‌ మీ బ్యాంక్‌ ఖాతాతో లింక్‌ అయి ఉంటే చాలు.*99# యూపీఐ సేవలను సులభంగా పొందవచ్చు.స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఈ సేవలపై ఇప్పటికే అవగాహన ఉంటుంది.

వారికి ఎన్నో విధాలుగా చెల్లింపులు చేపట్టవచ్చు.ఎందుకంటే వారికి ఇతర యూపీఐ పేమెంట్లతో యాక్సెస్‌ ఉంటుంది కాబట్టి.

కానీ, ఫీచర్‌ ఫోన్లు వాడే వారికి ఈ *99# ఒకటే ఆప్షన్‌.ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చి చాలా రోజులు అయింది.

కానీ, ఇది అంతంగా పాపులర్‌ కాలేదు.ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ పేమెంట్స్‌ ఎలా చేయాలో చూద్దాం.

ముందుగా మీ ఫోన్‌ నంబర్‌ బ్యాంక్‌ ఖాతాతో లింక్‌ అయి ఉండాలి.మీ ఫోన్‌ డయలర్‌ను ఓపెన్‌ చేయాలి.అప్పుడు *99# టైప్‌ చేసి, కాల్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి.అప్పుడు మీకు ఓ మెనూ ఓపెన్‌ అవుతుంది.

అందులో ఆప్షన్స్‌ ఉంటాయి.కానీ, డబ్బులు చెల్లింపునకు ‘1’ని టైప్‌ చేయాలి.

ఆ తర్వాత పేమెంట్స్‌ రిసీవర్‌ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్‌ సెలెక్ట్‌ చేయాల్సి ఉంటుంది.నంబర్‌ టైప్‌ చేసి, సెండ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

Telugu Receiver, Upi-Latest News - Telugu

ఉదాహరణకు మన వద్ద యూపీఐ మర్చంట్‌ నంబర్‌ ఉంటుంది.అది సెలెక్ట్‌ చేసి ‘1’ని ట్యాప్‌ చేయాలి.సదరు మర్చంట్‌ నంబర్‌ యూపీఐతో లింక్‌ అయి ఉంటే, సెండ్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.అప్పుడు ఎంత డబ్బు పంపించాలో నమోదు చేయాలి.రీమార్క్‌ను ఎంటర్‌ చేయాలి.చివరగా మీ యూపీఐ పిన్‌ను నమోదు చేస్తే ట్రాన్సక్షన్‌ పూర్తవుతుంది.ఈ విధంగా ఇంటర్నెట్‌ లేకుండానే మీ యూపీఐ ట్రాన్సక్షన్‌ పూర్తవుతుంది.

*99# తో యూపీఐను డిసేబుల్‌ చేయడం…ఫోన్‌ డయలర్‌ను ఓపెన్‌ చేసి.*99# టైప్‌ చేయాలి.అందులో ఆప్షన్‌ ‘4’ను ఎంచుకోవాలి.

ఆ తర్వాత ‘7’ను ఎంటర్‌ చేసి, డిరిజిస్టర్‌ కావడానికి సెండ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.అప్పుడు ‘1’ను ప్రెస్‌ చేస్తే.

యూపీఐ డిరిజిస్టర్‌ అయిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube