'షట్ డౌన్'...నష్టం తెలిస్తే నోరెళ్ళబెట్టాల్సిందే..!!!

అమెరికా చరిత్రలోనే అత్యధిక రికార్డ్ స్థాయిలో షట్ డౌన్ గా కొనసాగిన ఏకైక ఏడాదిగా చరిత్రలో నిలిచి పోయింది.ఒక పక్క ట్రంప్ పంతం, మరో పక్క డెమోక్రటిక్ పార్టీ పట్టుదల ఈ రెండు కారణాల వలన అమెరికాలో జీవనం స్తంభించింది.

 How Much Is Shutdown Worth In America-TeluguStop.com

ఎంతో మంది ఉద్యోగులు తినడానికి తిండిలేని పరిస్థితిలో ఇబ్బందులు పడ్డారు.చివరికి స్వచ్చంద సంస్థలు ఆయా ఉద్యోగులకి భోజన సదుపాయం కలిగించే పరిస్థితి ఏర్పడింది.అయితే

ఈ షట్ డౌన్ వలన జరిగిన నష్టం ఎంత అయ్యి ఉంటుందని అంచనా వేశారు ఆర్ధిక నిపుణులు.ఈ పరిణామాలతో అమెరికా ఆర్ధిక వ్యవస్థకి దాదాపు 21వేల కోట్లు మేర నష్టం వాటిల్లిందని అంచనాలు వేస్తున్నారు.వేతనాలు 8 లక్షల మందికిపైగా ఫెడరల్‌ ఉద్యోగులు సోమవారం నుండి తమ తమ విధులకు హాజరవుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తమ్మీద ఈ 5 వారాల షట్ డౌన్ తో అమెరికా ఆర్ధిక వ్యవస్థకు 1100 కోట్ల డాలర్ల మేర నష్టం వచ్చిందని సిబీవో తెలిపింది.అయితే ప్రస్తుతం అమెరికా తన ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడంతో 800 కోట్ల డాలర్ల మేర రికవర్‌ అయ్యే అవకాశం వుందని కూడా అంచనా వేస్తున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube