గుర్రం మ్యూజిక్ వాయించడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది అబద్ధం కదండీ బాబు.గుర్రమంత నిలువెత్తు నిజమండీ.
రోజురోజుకీ సోషల్ మీడియా పరిథి పెగిపోతున్న వేళ, అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.అందులో మరీ ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజు వైరల్ అవుతుండటం అందరికీ తెలిసినదే కదా.అందులో కొన్ని ఆసక్తికరంగా ఉంటే.మరికొన్ని ఫన్నీగా ఉంటాయి.
మరికొన్ని ఆశ్చర్యాన్ని గొలిపేలాగా ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయట పడి, తెగ సందడి చేస్తోంది.
ఒక గుర్రం తన ముక్కుతో, నోటితో పియానో వాయిస్తూ నెటిజన్లను తీవ్రంగా ఆకట్టుకుంటోంది.ఇక ఈ వీడియోలో ఏముందో ఒకసారి చూసినట్లయితే, ఓ గుర్రం అకస్మాత్తుగా ఓ పియానో దగ్గరకు వస్తుంది.
వచ్చి రావడంతోనే ఏదో ఆలోచన చేస్తూ… ఆ పియానో మెట్లమీద తన మూతితో టచ్ చేసింది.కాస్త సౌండ్ రాగానే ఆ గుర్రం ఏమనుకుందో ఏమిటో మరి! అలాగే తన ముక్కుతో పియానోని మీటుతూ ఓ అందమైన రాగం ఆలపించింది.
ఇక ఇది చూసిన నెటిజన్లు ఆ గుర్రం సంగీతానికి ఫిదా అయిపోతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆ గుర్రం అచ్చం మనిషిలాగానే పియానోను ప్లే చేయడం ముఖ్యంగా అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.అటు నుంచి ఇటు.ఇటు నుంచి అటూ.ముక్కుతో ప్లే చేస్తూ.అచ్చం ఏదో ట్రైన్ అయినా దానిలానే పియానో ప్లే చేయడం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.దాంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు.“వావ్! వాట్ ఏ ట్యాలెంట్” అని కొందరు, “మేము నేర్చుకోవాలంటే ఓ సంవత్సరం పడుతుంది.నువ్వు అదరగొట్టేశావ్” అని కొంతమంది, “మాకు కూడా నేర్పుతారా గుర్రం గారు!” అని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.
ఇక లక్షల్లో అది వీక్షణలు పొందటం కొసమెరుపు.ఒకసారి చూసి తరించండి.