విమానం ఎక్కాలంటే గర్భావతో కాదో తెలిపే పరీక్ష చేయించుకోవాల్సిందిగా మహిళా ప్రయాణికురాలి పట్ల అమర్యాదగా ప్రవర్తించినందుకు గాను హంగ్‌కాంగ్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది.ఓ రోజున హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికాలోని సైపాన్ దీవులకు వెళ్లేందుకు జపాన్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ తక్కువ ధరలకు విమాన ప్రయాణాన్ని అందించే హాంకాంగ్ ఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు.
అయితే ఆమె ఉదర భాగంతో పాటు శరీరం గర్భిణీ స్త్రీని పోలి ఉండటంతో సిబ్బందికి అనుమానం కలిగడంతో సెక్యూరిటీ చెక్ వద్ద నిలిపివేశారు.సదరు మహిళ తాను గర్భవతిని కాదని ఎంతగా మొరపెట్టుకున్నప్పటికీ ఎయిర్‌లైన్స్ సిబ్బంది వినిపించుకోలేదు.
ప్రయాణానికి అనుమతించాలంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.దీంతో ఆమె తప్పనిసరి పరిస్ధితుల్లో అంగీకరించక తప్పలేదు.
అనంతరం ఆ మహిళను ఎయిర్‌లైన్స్ సిబ్బంది వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు.రిపోర్ట్ వచ్చే వరకు ఆమెను బోర్డింగ్ లాంజ్‌లోనే నిలిపివేశారు.కొద్దిసేపటి తర్వాత రిజల్ట్ నెగిటివ్‌గా రావడంతో అంతా కంగుతిన్నారు.దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో హాంకాంగ్ ఎయిర్‌లైన్స్ యాజమాన్య సంస్థ కాథీ పసిఫిక్ బాధిత మహిళకు క్షమాపణలు చెప్పింది.
జపాన్ మహిళ స్పందిస్తూ ఎయిర్‌లైన్స్ సంస్థ తన పట్ల అవమానకరంగా ప్రవర్తించిందని ఆవేదన వ్యక్తం చేశారు.గర్భిణీ స్త్రీని పోలీ ఉండేలా శరీర ఆకారం ఉంటే… ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా అని ఆమె ప్రశ్నించారు.