తిప్పి తిప్పి కొడితే ఇరవై ఏళ్ళు ఉండవు కాని తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి.ఇప్పుడు చాలామంది టీనే్జర్స్ లో కనిపించే సమస్యే ఇది.
టీనేజ్ లోనే ఈ సమయస్య ఉంటే, ఇక ఇరవైల్లో ఇంకా ఎక్కువ అవదు ? చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉండవచ్చు కదా.చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు .వాటిని వెతికి వెతికి పీకేసుకోవడం, లేదంటే కలర్ రాసుకోవడం (ఇక్కడ దొరికిపోతారు) .కష్టమైన పనులే ఇవి.ఇలా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసే బదులు, అదే కష్టం మేం చెప్పే చిట్కాలలో పెట్టండి.ఫలితం ఉంటుంది.
* ఊసిరి ఈ సమస్యకు మంచి పరిష్కారం.విత్తులు తేసేసి ఊసిరిని బాగా గ్రైండ్ చేసి ఓ పేస్ట్ లాగా చేసుకోండి.
దీన్ని రోజు మీ తలకి పట్టండి.ఓ 20 నిమిషాలు ఉంచేసి కడిగేస్తూ ఉండండి.
* ఆల్మండ్ ఆయిల్, ఊసిరి రసం, నిమ్మరసం .ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని రోజు తలకి పడితే కూడా మంచి ఫలితం ఉంటుంది.అయితే దీన్ని వెంట్రుకలకి పట్టాక, ఓ గంటపాటు కడిగేయకూడదు.
* కొబ్బరినూనె, నిమ్మరసం .ఈ మిశ్రమం కూడా పనికివస్తుంది.కాని రోజు తలకి పట్టే అలవాటు చేసుకోవాలి.
తెల్ల వెంట్రుకలకి ఇది మంచి ట్రీట్మెంట్.
* ఆల్మండ్ ఆయిల్, నిమ్మరసం .సమపాళ్ళలో కలిపి రోజు పట్టుకుంటే తెల్ల వెంట్రుకల సమస్య త్వరలోనే తగ్గుముఖం పడుతుంది.
* హెన్నా కురుల ఆరోగ్యానికి ఎంతలా పనికివస్తుందో మీకు బాగా తెలిసిందే.
వారానికి ఓరోజు హెన్న పెట్టుకోవాలే కానీ,తెల్ల వెంట్రుకల సమస్యతో పోరాడటమే కాదు, మళ్ళీ తెల్ల వెంట్రుకలు రాకుండా అడ్డుకోవచ్చు.

*స్ట్రెస్ అనేది తెల్ల వెంట్రుకలు రావడానికి ఓ పెద్ద కారణం అని పరిశోధకులు చెబుతున్నారు.ఇందులో వాస్తవం లేకపోలేదు.విద్యార్థులకి చదువు ఒత్తిడి, ఉద్యోగస్తులకి పని ఒత్తిడి .ఈ ఒత్తిడిని జయించి కురుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మెడిటేషన్ చేయాలి.అందరు చెప్పే చిట్కానే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.
ధ్యానం మెదడులో కెమికల్ బ్యాలెన్స్ ని మెయింటేన్ చేస్తుంది.అందుకే ఇది అత్యవసరం.
* నూనె పెట్టుకోవడం అంటే బద్ధకం ఇప్పటి పిల్లలకి.కొత్త కొత్త హెయిర్ స్టయిల్స్ కోసం నూనె పెట్టుకోవడం మీద ఆసక్తి చూపించట్లేదు.
దానికితోడు జుట్టుకి నూనె పెట్టుకోవడం పాతకాలపు మనుషులు చేసే పని ఓ నిర్ణయానికి వచ్చేసారు.అదే అభిప్రాయం మీ పిల్లలకి కూడా ఉంటే రాత్రి పడుకునే ముందు నూనె పెట్టుకొని, తెల్లారి తలస్నానం చేయమని చెప్పండి.

* ఎండకి జుట్టుని ఎక్కువగా ఎక్పోజ్ చేయవద్దు.దీనివల్ల జుట్టు డ్రైగా అయిపోయి, మెల్లిమెల్లిగా రంగు మారిపోతుంది.ముఖ్యంగా ఈ ఎండకాలంలో ఈ సమస్య ఎక్కువ.కాబట్టి క్యాప్, లేదా గొడుగు తప్పక వాడండి.
* విటమిన్ బి 12 బాగా దొరికే ఆహార పదార్థాలు తినండి.తెల్లబడిన జుట్టుపై ఈ విటమిన్ బాగా పనిచేస్తుంది.
విటమిన్ బి 12 ఆరెంజ్, ఆవకాడో, చీజ్ లో బాగా దొరుకుతుంది.