మీకు లిప్‌స్టిక్‌ చరిత్ర గురించి తెలిస్తే షాకవుతారు!

ఆడవాళ్లు తమ పెదవులను మరింత ఆకర్షణీయంగా చూపించుకునేందుకు లిప్‌స్టిక్ వాడుతుంటారు.ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల లిప్ స్టిక్‌లు అందుబాటులో ఉన్నాయి.

 History Of Lipstick , Lipstick, History Of Lipstick , China, Indus Valley , Civ-TeluguStop.com

ఆధునిక కాలంలో వీటి వినియోగం కూడా పెరిగింది.ఇంతకీ లిప్‌స్టిక్ అనేది ఎలా పుట్టిందో తెలుసా? దీని చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.చైనా, సింధు లోయ నాగరికతల కాలం నాటి లిప్‌స్టిక్‌లను చరిత్రకారులు కనుగొన్నారు.దీనిని చూస్తే వేల సంవత్సరాల క్రితం నుంచే స్త్రీలు లిప్ స్టిక్ వాడుతున్నరని అర్థం అవుతుంది.వీటితో మగువలు తమ అందాలకు మెరుగులు దిద్దుకునేవారని తెలుస్తోంది.8వ-9వ శతాబ్దంలో అరబిక్ హకీమ్ జర్రా అబూ అల్-ఖాసిమ్ అల్-జహ్రాబీ పెదవులకు అలంకరించుకునేందుకు లిప్‌స్టిక్‌ను తయారు చేశారని చెబుతారు.దీని తర్వాత అతనికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని అంటారు.

అయితే కాలం గడిచినా, దానికి సామాజిక ఆమోదం లభించలేదు.కాగా ప్రస్తుతం యూరప్‌లో లిప్‌స్టిక్‌ వేసుకోవడంపై అనేక ఆంక్షలు విధించారు.లిప్‌స్టిక్ వేసుకునే మహిళలను మంత్రగత్తె అని భావించేవారు.బహుశా ఆమె ఎవరిదో రక్తం తాగి వచ్చి ఉండవచ్చని చెప్పుకునేవారు.చాలా మంది ఆడవాళ్ళని చూస్తే ఈనాటికీ అలానే అనిపిస్తుందనేవారు కూడా ఉన్నారు.16వ శతాబ్దంలో ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ తన పెదవులకు ఎరుపు రంగు పూసుకునేవారట.మైనం, పూల రంగులను కలిపి ఈ ఎరుపు రంగు లిప్2స్టిక్ తయారు చేసేవారట.ఇది నెమ్మదిగా ఆదరణ పొందుతూ వచ్చింది.19వ శతాబ్దం చివరలో ఫ్రెంచ్ కంపెనీ గెర్లే లిప్‌స్టిక్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.క్రమంగా దీనికి డిమాండ్ పెరుగుతూ వచ్చింది.

ఆ తర్వాత హాలీవుడ్ నటి మార్లిన్, ఎలిజబెత్ టేలర్ లిప్‌స్టిక్‌పై వేసుకున్నారు.అప్పటి నుంచి లిప్‌స్టిక్‌ల ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది.

ఇప్పుడిది ప్రతీ గల్లీకీ చేరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube