అసలు దెయ్యాలు అనేవి ఉన్నాయా.అనే ప్రశ్నకు ఇప్పటికి మన దగ్గర ఖచ్చితమైన సమాధానం అనేది లేదు.
ఏదో ఊహ మాత్రమే.దయ్యాలు ఉన్నాయని, అవి మనుషుల్ని బయపెడతాయని బ్రాంతిలో ఉంటాము.
కొందరు అయితే దయ్యాలు పేరు చెబితే చాలు ఆమ్మో దయ్యం అని ఆమడ దూరం పరుగు తీస్తారు.అలాంటిది ఒక ఇంట్లో దయ్యం ఉందని పుకార్లు వస్తే.
ఆ ఇంటిని కొనడానికి ఎవరయినా సరే సాహసం చేస్తారా చెప్పండి.వీలయినంత దూరంగా పారిపోతారు తప్పా ఎవరు కూడా ఆ దెయ్యాల కొంపను కొనడానికి ముందుకు రారు.
సరిగ్గా అమెరికాలోని ఓ ఇంటి విషయంలో కూడా ఇలానే జరిగింది.ఆ ఇంటిని అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.
ఇంటి అమ్మకానికి సంబందించి కొన్ని రకాల వాణిజ్య ప్రకటనలు కూడా చేసారు.అసలు ఆ ఇంటి గురించి ఎందుకు ఇంత చర్చ అనుకుంకుంటున్నారా.? ఎందుకంటే ఆ ఇల్లు చూస్తే ఒక దెయ్యాల కొంపలాగా కనిపిస్తుంది.దయ్యాల ఇంటిని గుర్తుచేసేలా ఆ ఇంటి బేస్‌మెంట్ పై విచిత్రమైన బొమ్మలు గీసి ఉన్నాయి.
ఆ బొమ్మలు చూస్తే ఎవరయినా సరే భయపడకుండా ఉండరు.ఆ ఇంటి గోడలపై చిత్ర విచిత్రమైన బొమ్మలు ఉండడంతో ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని, ఆ దయ్యాలే ఇలా ఇల్లంతా భయంకరమైన చిత్రాలను గీశాయని సోషల్ మీడియాలో గాసిప్స్ మొదలయ్యాయి.
ఆ దయ్యాల ఇల్లు సుమారు రెండు కోట్ల ధర పలుకుతుందని ఎస్టేట్ ఏజెంట్ చెబుతున్నారు.ఇక ఈ ఇంటిని 1957లో నిర్మించారు.
ఈ ఇంటిని డెమన్స్ హౌస్ గా పిలుస్తున్నారు.యూఎస్ మేరీల్యాండ్ సమీపంలోని హట్స్‌విల్లే ప్రాంతంలో ఈ డెమన్ హౌస్ ఉంది.
రెడిట్‌లో ఓ యూజర్ ప్రాపర్టీ వెబ్‌సైట్‌లో ఈ ఇంటి వివరాలను పోస్ట్ చేసారు.ఇంటి విషయానికి వస్తే.
ఈ ఇంట్లో మూడు బెడ్ రూమ్‌లు, రెండు బాత్రూమ్‌లు ఉన్నాయి.ఓపెన్ పార్కింగ్ స్థలం కూడా అందుబాటులో ఉంది.
ఇక ఈ ఇల్లు చూసిన వెంటనే అందరూ బయపడడానికి గల మరొక కారణం ఏంటంటే సైతాన్‌కు చిహ్నంగా భావించే భారీ పెంటాగ్రామ్ బొమ్మ కూడా ఒక గోడ మీద గీసి ఉంది.అలాగే ఆ భారీ పెంటాగ్రామ్ బొమ్మ పక్కనే గీసి ఉన్న సాలీడు చిత్రం కూడా చూడటానికే మరింత భయంకరంగా ఉందని చుసినవారు చెబుతున్నారు.
అయితే ప్రాపర్టీ వెబ్‌సైట్‌లో ఇంటిని మళ్ళీ రీడిజైన్ చేసి అమ్మకానికి పెడితే బాగుటుందని కొందరు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.అయితే మరికొందరు మాత్రం ఇంట్లో కనిపిస్తున్న బొమ్మలు దయ్యాల పని కాదని, ఆ ఇంట్లో దెయ్యాలు లేవని అంటున్నారు.
స్థానికంగా అక్కడ ఉండే అల్లరి పిల్లలు ఇంట్లోకి వెళ్లి ఇలా ఆ బొమ్మలను గీసి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.