అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.అమరావతి నుంచి అరసవల్లి వరకూ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పాదయాత్రకు వైసీపీ నేతలు ఆటంకం కలిగిస్తున్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది.ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు లోబడే అమరావతి మహా పాదయాత్ర జరగాలని ఆదేశాలు జారీ చేసింది.
పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది.అదేవిధంగా ఎవరైనా పాదయాత్రకు సంఘీభావం తెలపాలనుకుంటే రోడ్డు పక్కనే ఉండి సంఘీభావం తెలపాలని స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.నిబంధనలు పాటించని పక్షంలో పాదయాత్ర నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.