విజయవాడలోని ఏసీబీ కోర్టు దగ్గర హై అలర్ట్ జారీ చేశారు పోలీసులు.ఈ మేరకు న్యాయస్థానం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
అదేవిధంగా కోర్టుకు వెళ్లే దారుల్లో రాకపోకలను నిషేధించారు.ఈ క్రమంలోనే న్యాయవాదులను మాత్రమే కోర్టు ప్రాంగణంలోకి వచ్చేందుకు పోలీసులు అనుమతిని ఇస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది.శాంతి భద్రతల దృష్ట్యా సుమారు ఐదు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు కేసు వాదనల నేపథ్యంలో ఉదయం నుంచి ఏసీబీ కోర్టులోనే ఉన్న సంగతి తెలిసిందే.