లవ్ స్టోరీ సినిమా సక్సెస్ అటు నాగచైతన్య కెరీర్ కు, ఇటు సాయిపల్లవి కెరీర్ కు ప్లస్ అయిన సంగతి తెలిసిందే.తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నా లవ్ స్టోరీ సినిమాకు వీక్ డేస్ లో సైతం భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.
మలయాళ సినిమా ప్రేమమ్ నుంచి లవ్ స్టోరీ వరకు సినిమాసినిమాకు అభిమానులు పెరుగుతున్నారు.డ్యాన్స్ విషయంలో కూడా సాయిపల్లవి నంబర్ వన్ కావడంతో ఆమెకు ఆఫర్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి.
పాత్ర బాగుంటే మాత్రమే బాగా నటించగలమని సాయిపల్లవి అన్నారు.తెలుగు ప్రేమమ్ లో నటించే ఛాన్స్ వచ్చినా భయం వల్లే ఆ పాత్రలో నటించలేదని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.
కిస్ సీన్లు చేయడంపై తనకు ఇష్టం ఉండదని సాయిపల్లవి తెలిపారు.సినిమాలో కిస్ సీన్ గురించి స్పందిస్తూ ఆ సీన్ ఫేక్ అని ఆమె చెప్పుకొచ్చారు.కెమెరాలను సెట్ చేసి తాను ముద్దు పెట్టిన విధంగా ఆ సీన్లను షూటింగ్ చేశారని సాయిపల్లవి అన్నారు.
శేఖర్ కమ్ముల తన అభిప్రాయాలను ఎంతగానో గౌరవిస్తారని తనకు నచ్చని సన్నివేశాలను శేఖర్ కమ్ముల షూట్ చేయరని సాయిపల్లవి పేర్కొన్నారు.

సినిమాలో కిస్ సీన్ అత్యంత సహజంగా వచ్చిందని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.ప్రేక్షకులు కిస్ సీన్ ను బాగా రిసీవ్ చేసుకున్నారని ఆమె అన్నారు.గాల్లోకి ఎగిరి నేలకు వాలే సీన్ లో తాను పైకి ఎగరగా కెమెరా వర్క్ తో మరింత పైకి ఎగిరినట్టుగా చూపించారని సాయిపల్లవి తెలిపారు.