Vishwambara : విశ్వంభర సెట్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే రాజకీయాలలోకి వెళ్లారు.

 Heroine Entered Chiranjeevi Viswambhara Movie Set-TeluguStop.com

ఇలా రాజకీయాలలో కొంత కాలం పాటు కొనసాగిన చిరంజీవి రాజకీయాలలో ఇమడలేక తన పార్టీనీ కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి తిరిగి సినిమాలలోకి అడుగు పెట్టారు.ప్రస్తుతం చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ వశిష్ట ( Vasista ) దర్శకత్వంలో విశ్వంభర ( Vishwambara ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమాకి చిరు సరసన ఎవరు నటిస్తారనే విషయం పట్ల ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి హీరోయిన్ అడుగుపెట్టడంతో మెగాస్టార్ చిరంజీవి ఆమెకు పూల బొకే అందించి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

అందుకు సంబంధించినటువంటి వీడియోలను కూడా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

విశ్వంభర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన ఎవరు నటిస్తున్నారనే విషయానికి వస్తే…ఈ సినిమాలో మొదట నుంచి కూడా త్రిష ( Trisha ) పేరు వినిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే అందరూ అనుకున్న విధంగా ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు.తాజాగా ఈమె షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టడంతో ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దాదాపు 18 సంవత్సరాలు తర్వాత మరోసారి త్రిష చిరంజీవి స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమయ్యారు.వీరిద్దరి కాంబినేషన్లో గతంలో స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.స్టాలిన్ సినిమా తర్వాత త్రిష చిరంజీవితో కలిసి నటించిన సందర్భాలు లేవు అయితే విశ్వంభర సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఇక త్రిష సినీ కెరియర్ పూర్తి అయింది అనుకున్నటువంటి తరుణంలో ఈమె గ్రాండ్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం వరుస తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube