టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.
అంతేకాకుండా తెలుగులో అప్పట్లో హీరోగా ఒక వెలుగు వెలిగారు.ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదట విలన్ గా అవకాశాలు అందుకుని ఆ తరువాత నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అలా అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్.ఇక అప్పట్లో పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేశారు.
ఇక కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక అప్పటి వరకూ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఆ సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నాడు.
హీరో శ్రీకాంత్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ.ఇక శ్రీకాంత్ హీరోయిన్ ఊహ ను 1997లో పెళ్లి చేసుకున్నాడు.ఇక ఊహ కూడా సౌత్ లో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.ఇక వారిద్దరూ కలిసి సినిమాలు తీస్తూ ప్రేమలో పడ్డారు.
అనంతరం తొందరగానే పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.పెళ్లి తర్వాత ఊహ సినిమాలకు దూరం అయ్యింది.
ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు.ఇక ప్రస్తుతం ఊహ తన వైవాహిక జీవితంలో ఎంజాయ్ చేస్తోంది.ఇక ఇద్దరు అబ్బాయిలు కాగా ఒకరు రోషన్ ఇంకొకరు రోహన్. అమ్మాయి మేద.అబ్బాయి రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.శ్రీకాంత్, ఊహ ఇటీవల వారి 25వ మ్యారేజ్ యానివర్సరీని జరుపుకోవడంతో అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక అందులో ఊహ కూతురు మేధ చాలా అందంగా కనిపిస్తోంది.తల్లి అందమే ఆమెకు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.
రీసెంట్ గా కాలేజ్ లైఫ్ లోకి అడుగు పెట్టిన మేధ నటిగా ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి మరి.ఒకవేళ సినిమాల్లోకి వస్తే మాత్రం ఆమె మంచి క్రేజ్ అందుకుంటుందని చెప్పవచ్చు.