ప్రేమదేశం సినిమా ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటుడు అబ్బాస్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇలా హీరోగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈయన ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా అబ్బాస్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ నటించడం వల్ల ఈయన సక్సెస్ కాకపోవడంతో చివరికి సెకండ్ హీరోగా కూడా చేశారు.అయితే ప్రస్తుతం అబ్బాస్ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండి విదేశాలలో మోటివేషనల్ క్లాసెస్ చెబుతున్నారు.
సినిమాలకు దూరమైనటువంటి అబ్బాస్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఇకపోతే తాజాగా ఈయన ఆసుపత్రిలో బెడ్ పై ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు కంగారు పడ్డారు.
ఇలా హాస్పిటల్ బెడ్ పై అబ్బాస్ ఉండడంతో ఏం జరిగింది అంటూ ఆందోళన చెందారు.
ఇక ఈయన కుడికాలి లిగ్మెంట్ లోసమస్య ఉన్న కారణంగా తనకు సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలియజేశారు.అయితే ఆస్పత్రి బెడ్ పై ఉన్నప్పుడు తనలో ఏమాత్రం ప్రశాంతత లేదని ప్రస్తుతం తాను ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చానని తెలిపారు.ఇలా హాస్పిటల్లో ఉన్నప్పుడు నా కోసం ప్రార్థించిన, ఇప్పటికీ ప్రార్థిస్తూ ఉన్నటువంటి అభిమానులందరికీ ఈయన ధన్యవాదాలు తెలియజేశారు.
అయితే ప్రస్తుతం ఈయనకు కుడి కాలికి సర్జరీ చేయడంతో నడవలేని పరిస్థితిలో ఉన్నారు.అయితే త్వరలోనే ఈయన కోలుకోవాలని అభిమానులు కూడా ప్రార్థిస్తున్నారు.