దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.కుండపోత వర్షాలు కారణంగా ఢిల్లీ రోడ్లన్నీ జలమయమయ్యాయి.
వీధుల్లో ఎక్కడికక్కడ నీళ్లు ఉండిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో చిగురుటాకులా వణికిపోతోంది ఢిల్లీ మహానగరం.
లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.రోడ్లపై మోకాళ్ళ లోతు నీళ్ళు ఉండటంతో.
ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీ విమానాశ్రయంలో అదేరీతిలో టెర్మినల్ లో కూడా వరద నీరు చేరుకున్నాయి.దీంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.పలు విమానాలు దారులను మార్చడం జరిగింది.ఈ క్రమంలో విమానాశ్రయంలో నీటిని తొలగిస్తున్నట్లు.మళ్లీ విమాన రాకపోకలకు ఆటంకం కలగకుండా చూసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.ఇక ఇదే సమయంలో ఢిల్లీ విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలలో… బస్సుల్లో కూడా నీళ్లు చేరుకోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.
దీంతో ఢిల్లీ నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.