కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.ఈ మేరకు పిటిషన్ పై వాదనలను రేపు వింటామని న్యాయస్థానం తెలిపింది.
అటు అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ మంజూరులో హైకోర్టు వైఖరిపై సుప్రీంకోర్టు మండిపడింది.ఈ మేరకు మొత్తం 11 పేజీల ఆర్డర్ ను సీజేఐ ధర్మాసనం ఇచ్చింది.
దర్యాప్తు దశలో హైకోర్టు జోక్యం అవాంఛనీయమన్న సుప్రీం హైకోర్టు ఉత్తర్వులు సీబీఐ దర్యాప్తును నీరు గార్చే విధంగా ఉందని అభిప్రాయపడింది.హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని ప్రశ్నోత్తరాల రూపంలో విచారించాలని సీబీఐని ఆదేశించాల్సిన అవసరం కోర్టుకు లేదని ధర్మాసనం పేర్కొంది.
సీబీఐ ఛార్జిషీటులో లేని పలువురి నిందితుల పాత్ర గురించి విస్తృతంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం అవాంఛనీయమని సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీలో వెల్లడించింది.