పిగ్గీ బ్యాంక్( Piggy bank ) గురించి మీలో చాలామంది వినే వుంటారు. పాకెట్ మనీ( Pocket Money ) కోసం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును చాలామంది పిల్లలు దాచుకుంటూ వుంటారు.
ఇందుకోసం మట్టి, ఇతర లోహాలతో తయారుచేసిన చిన్న చిన్న పిగ్గీ బ్యాంక్స్ వంటివి ఉపయోగిస్తుంటారు.ఈ క్రమంలో రానున్న రోజుల్లో అందులో ఎంత డబ్బు పోగైందో తెలుసుకోవాలన్న ఆతృత వారిలో మొదలైంది.
ఎందుకంటే వాటితో ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకునే చిన్నారులు అందుకు సరిపడా డబ్బు పోగైందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలనుకోవడం సహజం.ఇలాంటప్పుడు దాన్ని పగలగొట్టినా, తెరిచి చూసినా.
ఒక్కో రూపాయి లెక్క పెట్టేసరికి గంటలు సమయం వెచ్చించాల్సి వస్తుంది.

అలాకాకుండా వేసిన డబ్బును వేసినట్లుగా.ఎప్పటికప్పుడు అదే లెక్కించి చూపగలిగితే ఎలాగుంటుంది.సూపర్ కదూ.అదే ఐడియాతో ‘డిజిటల్ కాయిన్ కౌంటింగ్ పిగ్గీ బ్యాంకులు( Digital Coin Counting Piggy Banks )’ ఇపుడు మార్కెట్లోకి వచ్చేశాయి.చూడ్డానికి జార్‌లా, సాగదీసేలా వుండి, కుదించుకునేలా ఉండే డబ్బా మాదిరిగా, పిగ్గీ ఆకృతిని పోలి వుండేవి వచ్చేశాయి.
అంతేకాకుండా ఏటీఎం మాదిరిగా.ఇలా విభిన్న మోడల్స్‌లో ఉన్నవి మార్కెట్లో దొరుకుతున్నాయి.
జార్ తరహాలో ఉన్న పిగ్గీ బ్యాంక్ మూతకు, ఏటీఎం మాదిరిగా ఉన్న పిగ్గీ బ్యాంక్‌కు ముందు భాగంలో డిజిటల్ మీటర్ అమరి ఉంటుంది.

ఇక మీరు అందులో కాయిన్స్ వేసిన ప్రతిసారీ.దానిపై ఉన్న ‘+’, తీసిన ప్రతిసారీ ‘-‘ గుర్తులున్న బటన్స్‌ని నొక్కితే.ఎంత బ్యాలన్స్ ఉందో మీటర్‌పై ఆటోమేటిక్ గా కనిపిస్తుంది.
అంతేకాకుండా వాయిస్ రూపంలో చెప్పే డిజిటల్ మెషీన్లూ దొరుకుతున్నాయి.అంతేకాకుండా వీటిని పగలగొట్టాల్సిన పనిలేదు.
జస్ట్.అలా మూత తీసి, ఏటీఎం ముందు భాగంలో ఉన్న డోర్ ఓపెన్ చేసి.
అందులో ఉన్న డబ్బును తీసుకోవచ్చు.తిరిగి వీటిని బిగించుకొని.
మళ్లీ ఉపయోగించుకోవచ్చు.మరెందుకాలస్యం, ఈ డిజిటల్ పిగ్గీ బ్యాంక్‌లను ఆలస్యం చేయకుండా మీ పిల్లలకు దీన్ని బహుమతిగా ఇచ్చేయండి.