నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఇటీవలి కాలంలో భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పనిచేసిన కాలంలో అమెరికా ఫస్ట్ నినాదంతో ఆయన అనేక ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తీసుకొచ్చారు.
అంతేకాకుండా పలు రకాల వీసాలపైనా ఆంక్షలు విధించారు.దీంతో అగ్రరాజ్యంలో స్ధిరపడాలనుకున్న భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఏటా హెచ్-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.
వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.
ఈ విషయంలో భారతీయ టెక్కీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిసారించారు.మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్న మోడీ.
నిన్న అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా భారతీయుల అగ్రరాజ్య ప్రవేశానికి వారధిగా ఉన్న హెచ్-1బీ వీసాపై ఆయనతో చర్చించారు.
అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు ఆ దేశ సామాజిక భద్రతకు తోడ్పాటునందిస్తున్నారని మోడీ గుర్తుచేశారు.అలాగే ఆఫ్ఘన్లో ప్రస్తుత పరిణామాలు, టెర్రరిజం, వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ రంగంపై ఇద్దరూ నేతలు చర్చలు జరిపారు.

మోడీ- బైడెన్ సమావేశం ముగిసిన వెంటనే స్పందించిన శ్వేతసౌధం.2021లో ఇప్పటి వరకు భారత విద్యార్థులకు 62 వేల వీసాలు జారీ చేసినట్లు గుర్తుచేసింది.ప్రస్తుతం అగ్రరాజ్యంలో ఉన్న రెండు లక్షల మంది భారత విద్యార్థులు.ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 7.7 బిలయన్ డాలర్లు సమకూరుస్తున్నారని తెలిపింది.
.