ప్రపంచం ఓ కుగ్రామంగా మారిన నేటి కాలంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.అయితే అమాయకులను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు వారిని నిలువునా ముంచేస్తున్నారు.
ఫారిన్ పంపిస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.దీనిపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విదేశాల్లోని పలు సంఘాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా నిత్యం ఇలాంటి కేసులు చోటు చేసుకుంటూనే వున్నాయి.
ఈ క్రమంలో యూకేలోని( UK ) ఓ సిక్కు దేవాలయం కీలక సూచనలు చేసింది.విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసాలు వచ్చేలా చేస్తామంటూ చెబుతున్న వారికి దూరంగా వుండాలని సూచించింది.

కొందరు కేటుగాళ్లు.యూకేలోని గ్రేవ్‌సెండ్‌లోని గురునానక్ దర్బార్ గురుద్వారాలో( Guru Nanak Darbar Gurdwara ) ఉద్యోగాలు వున్నాయని సోషల్ మీడియాలో నకిలీ పోస్టులు పెట్టారు.అంతేకాకుండా ఇక్కడికి వచ్చే వారికి భోజనం, వసతి, ప్రయాణ టికెట్లు కూడా ఇస్తామంటూ పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి.ఈ విషయం గురుద్వారా మేనేజ్‌మెంట్‌కు తెలియడంతో వారు అప్రమత్తమయ్యారు.
ఇది ఫేక్ న్యూస్ అని.తమ గురుద్వారా అలాంటి ప్రకటన చేయలేదని ప్రకటించింది.

అయితే ఈ ప్రకటనను సోషల్ మీడియాలో చూసిన కొందరు గురుద్వారా( Gurdwara ) అధికారులకు ఫోన్లు చేసి విషయం ఆరా తీస్తున్నారు.దీనిపై గురుద్వారా ప్రధాన కార్యదర్శి జగదేవ్ సింగ్ విర్దీ( Jagdev Singh Virdee ) స్పందించారు.మోసగాళ్లు గురుద్వారా మాదిరిగానే వెబ్‌సైట్ డొమైన్ , ఈ మెయిల్, చిరునామాలను ఏర్పాటు చేశారని తెలిపారు.అంతేకాకుండా జాబ్ ఆఫర్ పేరిట నకిలీ లేఖలు ఇస్తున్నారని.ఆ తర్వాతే నిజస్వరూపం బయటపెడుతున్నారని ఆయన చెప్పారు.జాబ్ ఆఫర్ వచ్చినందున ఎక్కువ డబ్బు ఇస్తే.
తామే ప్రయాణ టిక్కెట్, వీసా ఏర్పాటు చేస్తామని మాయమాటలు చెబుతున్నారని జగదేవ్ సింగ్ పేర్కొన్నారు.అందువల్ల కేటుగాళ్లతో వ్యక్తిగత వివరాలను పంచుకోవడం, నగదు బదిలీ వంటివి చేయొద్దని ఆయన నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
దీనిపై కెంట్ పోలీసులకు, నేషనల్ హోమ్ ఆఫీస్ ఆఫ్ యాక్షన్ ఫ్రాడ్‌కు సమాచారం అందించినట్లు జగదేవ్ సింగ్ తెలిపారు.ఇకపోతే.
గ్రేవ్‌సెండ్‌లో దాదాపు 15000కు పైగా సిక్కులు నివసిస్తున్నారు.