పూరీ జగన్నాథ్ అంటేనే మాస్ ఆడియెన్స్ ను తన డైలాగ్స్ తో మెప్పిస్తాడు.అలాగే మ్యూజిక్ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టు కోవడంలో పూరీ ముందు వరుసలో ఉంటాడు.
కానీ ఈసారి మాత్రం లెక్క తప్పింది.ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించగా.రిలీజ్ అయినా అన్ని చోట్ల ఒకే స్పందన వచ్చింది.ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఏ విషయంలో సంతృప్తి పరచలేక పోయింది.దీంతో ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి చాలా కారణాలనే చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే మైక్ టైసన్ పేరు కూడా వినిపిస్తుంది.
ఈ సినిమా ఇంత హైప్ రావడానికి ఉపయోగ పడిన మైక్ టైసన్ ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కూడా కీలక పాత్ర పోషించాడు.
ఎందుకంటే పూరీ మైక్ టైసన్ పై తీసిన కామెడీ క్లైమాక్స్ బెడిసి కొట్టింది అనే చెప్పాలి.

ఇంత హైప్ తో ఈయనను తీసుకు వచ్చి పూరీ చివరకు ఈయనతో కామెడీ క్లైమాక్స్ చేయించాడు.
అయితే ఏది ఎలా ఉన్న ఈయనకు మాత్రం మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకు వచ్చినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో మైక్ టైసన్ చేసిన గెస్ట్ రోల్ కోసం ఏకంగా 23 కోట్ల రూపాయలు చెల్లించారట మేకర్స్.23 కోట్లు అంటే హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అనే చెప్పాలి.కానీ ఇంత పెట్టి తీసి ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఇది కూడా లాస్ గానే మిగిలి పోయింది.