ఐపీఎల్ సరికొత్త రూల్ దెబ్బకు బౌలర్ల గుండెల్లో గుబుల్..?!

క్రికెట్ ఫార్మెట్ లల్లో ఎక్కువ మంది ఐపిఎల్ నే ఇష్టపడుతారు.ఐపిఎల్ వచ్చిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు.

 Gubul In The Heart Of The Bowlers For The Latest Rule Blow In The Ipl, Bcci, Ipl-TeluguStop.com

అలాంటి ఐపిఎల్ వల్ల ప్రపంచ మొత్తం అనేక బెట్టింగులు జరుగుతుంటాయి.వీటిపై అనేక పోలీసు కేసులు నమోదవుతున్నా కూడా దీనిని మాత్రం బ్యాన్ చేయడం లేదు.

ఎందుకంటే దీనిపై కొన్ని వేల కోట్ల లాభం వస్తుంది కాబట్టి.ఈ ఏడాది కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపిఎల్ 2021 ను వాయిదా వేయాల్సి వచ్చింది.

లేకుంటే ఈ పాటికి ఐపిఎల్ విజేత ఎవరో తెలిసిపోయి ఉండేది.కొన్ని మ్యాచ్ లు జరగగా ఆటగాళ్లకు కరోనా రావడంతో ఐపిఎల్ ను వాయిదా వేశారు.

ఇప్పుడు దానిని నిర్వహించడానికి సన్నద్దమవుతున్నారు.ఇక ఐపిఎల్ లో ఇంకా 31 మ్యాచ్‌ లు మిగిలిపోయి ఉన్నాయి.

వీటిని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.దీనికి సంబంధించి షెడ్యూల్ ను బీసీసీఐ సిద్దం చేసింది.

వచ్చే నెల సెప్టెంబర్ 19వ తేది నుంచి అక్టోబర్ 15వ తేది వరకు ఐపిఎల్ లో మిగిలిపోయి ఉన్న ఆ 31 మ్యాచులను బీసీసీఐ నిర్వహించనుంది.గతంలో వచ్చిన ప్రాబ్లమ్స్ రాకుండా ఈసారి గట్టి చర్యలను తీసుకుంటోంది.

Telugu Bcci, Ipl, Sixers, Ups-Latest News - Telugu

ఈసారి కొన్ని కొత్త రూల్స్ ను బీసీసీఐ నిర్ణయించింది.మ్యాచ్ జరుగుతున్నప్పుడు బాల్ స్టాండ్ లోకి వెళ్ళినట్లయితే ఆ బాల్ ను ఉపయోగించకూడదు.గ్రౌండ్ కు బయట పడేటటువంటి బాల్స్ ను వేరే ఎవరైనా తాకే అవకాశం ఉన్నందున ఇలా బాల్ బయట పడితే దానిని వాడకూడదని నిర్ణయించింది.ఈసారి జరగబోయే మ్యాచ్ కు ప్రేక్షకులు కూడా హాజరు కానున్నారు.

అందుకే బీసీసీఐ ఈ నిబంధన పెట్టింది.ఈ రూల్ బౌలర్స్ కు తలనొప్పిని తెచ్చి పెట్టే విధంగా ఉంది.

కొత్త బాల్ ని పదేపదే వాడుతున్నట్లైతే ప్రతిసారీ బాల్ ను సరైన విధంగా విసరాల్సి ఉంటుంది.కానీ బాల్ బ్యాట్ పై నుంచి సులువుగా ఎగరగలదు.

దీంతో బౌలర్లకు తలనొప్పి ఖాయమనే అనిపిస్తోంది.అందుకే ఈ రూల్ బౌలర్లకు అంతగా నచ్చదని చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube