హైదరాబాద్ జలసౌధలో ఎంకే సింగ్ ఆధ్వర్యంలో జీఆర్ఎంబీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ తో పాటు తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు హాజరైయ్యారు.
గోదావరిపై గూడెం, మోదికుంట ప్రాజెక్టుల డీపీఆర్ లపై చర్చించారు.అదేవిధంగా సీడ్ మనీ, టెలిమెట్రీతో పాటు పలు అంశాలపై చర్చ జరిగిందని సమాచారం.
ఈ సందర్భంగా తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ మాట్లాడుతూ గోదావరి – కావేరి నదుల అనుసంధానానికి కేంద్రానికి తొందర ఎందుకని ప్రశ్నించారు.నదుల అనుసంధానికి తాము వ్యతిరేకం కాదన్న ఆయన సమగ్ర విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలన్నారు.
గోదావరి నదిపై టెలిమెట్రీల అవసరం ఏముందో చెప్పాలన్నారు.పోలవరం బ్యాక్ వాటర్ పై సర్వే చేయాలని మరోసారి కోరుతామని సీఎస్ రజత్ కుమార్ తెలిపారు.