రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుగు విశ్వ విద్యాలయంలో గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర రాజన్ గారితో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరం.బతుకమ్మ పాటలో ఉండే తెలుగు పదాల మీద పరిశోధన చేస్తే, తెలుగు బాష మరింత పరిపుష్టం అవుతుంది.
బతుకమ్మ పండుగ అత్యంత ప్రాచీనమైన పండుగ.తెలంగాణ జాగృతితో పాటు, అనేక సంస్థలు బతుకమ్మ పండుగకు సంబంధించి పాత పాటలు సేకరిస్తున్నారు.
పాత బతుకమ్మ పాటల్లో ఉండే పదాల మీద ప్రత్యేక అధ్యయనం చేసినట్లైతే, మనం మరచిన తెలుగు పదాలు, తెలంగాణ పదాలు, మళ్లీ బాషలో చేరే అవకాశం ఉంటుంది.తెలుగు మరింత పరిపుష్టం అయ్యే అవకాశం ఉంది.
దీని మీద ఆలోచించాల్సిందిగా వైస్ ఛాన్సిలర్ గారిని కోరుతున్నాను అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
బతుకమ్మ పండుగ మీద అనేక మంది పరిశోధనలు చేస్తున్నారు.
గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ గారు ప్రతి రోజు రాజ్ భవన్ లో బతుకమ్పండుగ జరుపుకోవడం సంతోషకరం.ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వం తరుపున ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నాను.
వందల సంవత్సరాల నుండి బతుకమ్మ పండుగను కాపాడుకున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను