ఒడిశాలోని జాబ్పూర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది.కొరాయి రైల్వేస్టేషన్ లో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది.
ప్రమాదవశాత్తు ప్లాట్ ఫామ్ పైకి దూసుకు రావడంతో గూడ్స్ లోని పది బోగీలు బోల్తా పడ్డాయి.ఈ ప్రమాదంలో ప్లాట్ ఫామ్ పై రైలు కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు.
అదేవిధంగా పలువురికి గాయలు కాగా.గూడ్స్ బోగీల కింద మరికొందరు ప్రయాణికులు చిక్కుకుని పోయారు.
రంగంలోకి దిగిన అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.