కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అరుణ్ గోయల్ బాధ్యతలు చేపట్టారు.1985 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ కి చెందిన అరుణ్ గోయల్ నేడు బాధ్యతలు చేపట్టడం జరిగింది.ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్ తో పాటు ఇద్దరు కమిషనర్ లు ఉంటారు.ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర ఈ ఏడాది మే 15వ తారీఖున పదవి విరమణ పొందడంతో.
మొన్నటిదాకా కమిషనర్ గా ఉన్న రాజీవ్ కుమార్.ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది.
దీంతో త్రిసభ్య కమిషన్ ఇద్దరు సభ్యుల సంఘంగా ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అను చంద్ర పాడే మాత్రమే త్రిసభ్య కమిషన్ లో కొనసాగుతూ వచ్చారు.
దాదాపు ఆరు నెలలపాటు కమిషనర్ పోస్ట్ ఖాళీగా ఉన్న క్రమంలో… ఆ పదవిలో అరుణ్ గోయల్ తాజాగా బాధ్యతలు చేపట్టారు.అరుణ్ గోయల్ కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్ గా గత శనివారమే కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
కాగా నేడు బాధ్యతలు చేపట్టడంతో మొన్నటిదాకా ఇద్దరు సభ్యులు కలిగిన పోల్ ప్యానెల్ …ఇప్పుడు యధావిధిగా ముగ్గురు సభ్యులు కలిగిన సంఘంగా మారింది.