రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబుకు చల్లటి వాతావరణం అవసరమని వైద్య బృందం జైలు అధికారులకు తెలిపిందని తెలుస్తోంది.
ఈ మేరకు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్ వైద్య బృందం నివేదిక వెలుగులోకి వచ్చిందని సమాచారం.చంద్రబాబు ఛాతీ, చేతులు, గడ్డంపై ఎర్రని దద్దులతో పాటు స్కీన్ అలర్జీ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఈ క్రమంలో ఈనెల 12వ తేదీన ఆయనను పరీక్షించిన వైద్య బృందం జైలు సూపరింటెండెంట్ కు నివేదిక అందించిన సంగతి తెలిసిందే.మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.