అమెరికా వ్యాప్తంగా హై అలెర్ట్ కొనసాగుతోంది.ఒక పక్క ఇరాన్ హెచ్చరికలతో వైట్ హౌస్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసీ హై అలెర్ట్ ప్రకటించారు.
పూర్తిస్థాయిలో ఊహించని రీతిలో ఇక్కడ సాయుధ బద్రతా దళాలని మోహరించింది అమెరికా.ఈ పరిమాలాతో అమెరికాలో కాస్తంత అలజడి నెలకొంది.
అయితే ఒక పక్క ఇరాన్ హెచ్చరికలతో అలెర్ట్ అయిన అమెరికా మరో పక్క మంచు చేస్తున్న దాడితో మరో సారి అలెర్ట్ అయ్యింది.
పశ్చిమ వర్జీనియాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు కి ఆ ప్రాంతాలలో ఉన్న రోడ్లన్నీ మంచుతో కప్పేసి ఉన్నాయి.
రోడ్డుపై మందంగా ఉన్న ఈ మంచుతో వరుసగా ప్రమాదాలు జరుగుతూ ప్రాణ నష్టం కూడా వాటిల్లుతోందని అంటున్నారు స్థానికులు.ఎదురుగా వస్తున్న వాహనాలు కనపడక పోవడం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇంకొన్ని ప్రాంతాలలో
తేలికపాటి హిమపాతం వలన రోడ్లపై మంచు పేరుకుపోయి కార్లు జారిపోవడంతో ఒక దానితో ఒకటి డీ కొని తీవ్ర నష్టం వాటిల్లోతోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.ఇప్పటి వరకూ వందకి పైగా ప్రమాదాలు జరిగాయని, ఈ క్రమంలోనే మీరు వెళ్ళాలనుకున్న టూర్ లు అన్నీ వాయిదాలు వేసుకోండి అంటూ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పరిమాలతో అమెరికా ప్రజలు ఇళ్లకే పరిమితమై పోయారు.
.