బిగ్ బాస్ షో సీజన్6 చూడని వాళ్లు, చూసిన వాళ్లకు గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.గీతూ రాయల్ బిగ్ బాస్ షోకు ప్లస్ అవుతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆమె బిగ్ బాస్ షోకు మైనస్ అవుతున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే బిగ్ బాస్ షోలో తన క్రష్ గురించి తాజాగా గీతూ రాయల్ చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ హౌస్ లో రాజశేఖర్ క్రష్ ఎవరిపై అనే చర్చ రాగా రాజశేఖర్ క్రష్ నేనే అంటూ గీతూ రాయల్ కామెంట్లు చేశారు.
రాజశేఖర్ ను బ్రదర్ అంటావు కదా అని అందరూ అడగగా అవును నాకు రాజశేఖర్ తమ్ముడే అని రాజశేఖర్ కు నేను అక్కనే అని కానీ రాజశేఖర్ కు అక్కతోనే క్రష్ నడుస్తోందని గీతూ రాయల్ కామెంట్లు చేయడం గమనార్హం.ఆ తర్వాత అక్కతో క్రష్ ఉండకూడదా లవర్ తో మాత్రమే క్రష్ ఉండాలా అని ఆమె కామెంట్ చేశారు.
గీతూ ఆ విధంగా కామెంట్లు చేయడంతో ఏమని సమాధానం చెప్పాలో రాజశేఖర్ కు అర్థం కాదు.ఆ తర్వాత ఫైమా క్రష్ సంగతి తర్వాత ముందు బ్రష్ చేసి రండి అంటూ కామెంట్ చేయడం గమనార్హం.
బిగ్ బాస్ షో రేటింగ్స్ విషయంలో రెండో వారం కూడా నిరాశపరిచింది.బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే మాత్రమే ఈ షో పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయి.
బిగ్ బాస్ షోను అభిమానించే వాళ్లతో పోల్చి చూస్తే బిగ్ బాస్ షోను విమర్శించే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.బిగ్ బాస్ షో హోస్ట్ ను కూడా మార్చాల్సిన తరుణం ఆసన్నమైందని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.