ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్..!!

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.తొలిరోజు అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది.

 Former Minister Harish Rao Is Serious About The Government Brs Mla, Harish Rao-TeluguStop.com

ఈ చర్చ అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడిగా సాగింది.గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ఆమోదం తెలిపింది.

ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao )ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.సభలో తమని మాట్లాడనీయడం లేదని ఆరోపించారు.

సభ బుధవారానికి వాయిదా వేయక ముందు హరీష్ రావు మాట్లాడుతుండగా పలుమార్లు మైక్ కట్ చేయడం జరిగింది.దీంతో సభ అనంతరం మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడుతూ.

సీఎం రేవంత్ ( CM Revanth reddy )మాటలు కోటలు దాటుతున్నాయి…కానీ చేతలు గడప దాటడం లేదు.

మమ్మల్ని మాట్లాడినవ్వకుండా మూడుసార్లు మైక్ కట్ చేశారు.

తప్పులు ఎత్తిచూపుతున్నామని సభా వాయిదా వేశారు.బీఆర్ఎస్ పార్టీ( BRS )ని విమర్శించే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని.

హరీష్ రావు మండిపడ్డారు.మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలలో హరీష్ రావు… మంత్రులు బట్టి విక్రమార్క( Bhatti Vikramarka ), శ్రీధర్ బాబు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో.హరీష్ రావు వివరణలకే పరిమితం కావాలని చర్చను లేవదీసే అంశాలను ప్రస్తావించరాదని స్పీకర్ సూచించారు.

సీనియర్ శాసనసభ్యుడిగా వాస్తవాలు సభలో చెప్పే హక్కు తనకుందని.హరీష్ రావు తెలియజేశారు.

చెప్పొద్దంటే నిరసన తెలపడానికి అనుమతి ఇవ్వాలని నిరసన తెలిపే హక్కు తనకు ఉందని అన్నారు.దీంతో వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్పీకర్ శాసనసభను బుధవారానికి వాయిదా వేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube