కరోనా మహమ్మారి తొలి కేసు తమ దేశంలో రిజిస్టర్ అయినప్పటికీ ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పకుండా చైనా దాచింది.దాని కారణంగానే ప్రస్తుతం ప్రపంచమంతా ఒక పక్క కరోనా మరోపక్క ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంది.
ఈ విషయంలో ఇప్పటికీ ప్రపంచం చైనా మీద గుర్రుగా ఉంది.దాన్ని డైవర్ట్ చేయడానికి భారతతో మొదలుపెట్టిన బోర్డర్ క్లాష్ ఇప్పుడు భారత భూమిని మింగేవరకు వెనుకకు వెళ్ళేలా లేదు.
ఇది మన అందరికీ తెలిసిన విషయమే మరి మనం ఈరోజు తెలుసుకోబోయే విషయం ఏంటంటే.
చైనా వాటర్ ను ఆయుధంలా ప్రయోగిస్తున్నది.
అవును మీరు విన్నది నిజమే చైనాలో అవసరానికి మించి డ్యామ్స్ ఉన్నాయి.వీటిని చైనా ఆసియాలో తన ఆధిపత్యానికి ఎదురు వచ్చే దేశాల మీద ప్రయోగించడానికి సిద్ధం చేసింది.
సరిగ్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు వూహాన్ ను సందర్శించడానికి చైనాకు ప్రయాణం అవుతున్నారు అన్న సందర్భంలో చైనాలో గత 80 ఏళ్లుగా ఎప్పుడూ లేనన్ని వరదలు ఉన్నట్టుండి వచ్చాయి.ఈ వరదల వల్ల చైనాలో మహా మహా నగరాలు మునిగిపోయాయి.
అయినా ఆ వరదలు ఇంకా ఆగలేదు.వీటి పై ప్రపంచ దేశాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి కానీ చైనా ప్రేమికులు మాత్రం అక్కడ ఎడతెరిపిలేని వర్షాలు కురవడం వల్లే ఈ వరదలు వచ్చాయి అంటున్నారు.
మరి ఇది ఎంతవరకు నిజమో రానున్న కాలంలో తెలియాల్సివుంది.ఇక ప్రస్తుతం చైనాలో వచ్చిన వరద నీరు తాజాగా యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడిన లేషాన్ బుద్ధ విగ్రహం పాదాలను తాకాయి.
ఈ విగ్రహం వరద మట్టం కంటే ఎక్కువ ఎత్తులోనే ఉన్నప్పటికీ గత 70 ఏళ్లలో చైనాలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆ ప్రాంతంలో వరదలు రావడంతో ఈ ఘటన జరిగిందని అక్కడి అధికారులు అభిప్రాయపడ్డారు.