టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి( Kriti Shetty ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకువచ్చింది.ఈ సినిమా తర్వాత బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.
అయితే ఉప్పెన సినిమా( Uppena Movie ) తర్వాత అంతో ఇంతో ఈమెకు గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా అంటే బంగార్రాజు అని చెప్పవచ్చు.

సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.ఇందులో నాగార్జున నాగచైతన్య రమ్యకృష్ణ నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తెలుగులో కృతిశెట్టి కి ఆఫర్స్ కరువయ్యాయి.
ఇటీవల ఆమె నటించిన కస్టడీ చిత్రానికి సైతం మిశ్రమ స్పందన లభించింది.అయితే ప్రస్తుతం కృతి చేతిలో కేవలం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది.
ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం బేబమ్మకు మరో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి(
Jayam Ravi ) చేయబోతున్న జీని చిత్రంలో( Genie Movie ) ఎంపికయ్యిందట.

తాజాగా బుధవారం ఈ సినిమా ఓపెనింగ్ అయ్యింది.కృతితోపాటు కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి సైతం నటించనున్నారు.దేవయాని కీలకపాత్ర పోషించనుంది.ఈ చిత్రానికి అర్జునన్ దర్శకత్వం వహించనున్నాడు.వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై డా.ఐసరి, కె.గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అయితే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వరుసగా అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటిగా డిజాస్టర్ కావడంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
ప్రస్తుతం బేబమ్మ ఉన్న పరిస్థితులలో ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా చాలు ఈమెకు మళ్ళీ అవకాశాలు క్యూ కడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.