నమస్తే అక్కయ్య.నమస్తే తమ్ముడు.
నమస్తే పాపా .నమస్తే నమస్తే అంటూ ఆప్యాయతను కురిపిస్తూ… ఎప్పుడూ చిరునవ్వును చిందిస్తూ, అందరి ముఖాల్లోనూ అదే చిరునవ్వు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.ప్రతి పేద వాడి కష్టాన్ని తన కష్టంగా , అక్కా చెల్లెమ్మ ల అభ్యున్నతే ధ్యేయంగా, ఎదుగు, బొదుగు లేని బడుగు బలహీన వర్గాల బతుకులను బాగు చేయడమే లక్ష్యంగా.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని( YSR Congress Party ) స్థాపించి , నిస్వార్థ రాజకీయ నాయకుడిగా ఎదిగి, రాజకీయాల్లో లెజండ్ గా మారారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.
( CM Jagan Mohan Reddy )
వైసీపీ స్థాపించిన దగ్గర నుంచి.జనం మధ్యే ఉంటూ.జనాల కష్టాలను తెలుసుకుంటూ పాదయాత్ర పేరుతో సామాన్య జనాలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా చూసిన జగన్ ఆ కష్టాలను తీర్చాలని, ఆ కన్నీళ్ళ ను తుడవాలి అనే దృడ సంకల్పం తో, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టలనే తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చి.పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన అన్ని హామీలను.
అమలు చేసి చరిత్ర సృష్టించారు.జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు , సంస్కరణలకు( Welfare Schemes ) దేశవ్యాప్తంగా ప్రశంశలే దక్కాయి.
అనేక రాష్ట్రాలు ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంస్కరణలను తమ తమ రాష్ట్రాల్లోనూ అమలు చేశాయి.దీంతో దేశవ్యాప్తంగా జగన్ ఖ్యాతి మరింతగా పెరిగింది.
సీఎంగా తీరిక లేని జీవితాన్ని గడుపుతూ నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న జగన్ పై విపక్ష పార్టీలు ఎన్ని అసత్య ప్రచారాలు చేస్తున్న, ఎన్ని కుట్రలు పన్నుతున్నా, వాటిని చిరునవ్వుతోనే జగన్ ఎదుర్కొంటున్నారు. అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నంగా తమ ప్రభుత్వ పాలనలో మీకు మంచి జరిగింది అనుకుంటూనే మళ్ళీ తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలంటూ ధైర్యంగా చెప్పుకోగలిగిన ఏకైక నాయకుడు జగన్ మాత్రమే అనడం లో సందేహమే లేదు.అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ప్రజా బాంధవుడుగా జగన్ ( Jagan ) ఎదిగిన తీరు అభినందనీయం .
కులం చూడం, మతం చూడం, ప్రాంతం, వర్గం చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు చేయం, అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం.అంటూ జగన్ చెబుతుంటే.ప్రతి వైసీపీ కార్యకర్త గా గర్వంగా , గౌరవం గా కాలరు ఎగురవేసుకునే స్థాయి కల్పించిన జగన్ … నిజంగా ఆ పార్టీ నాయకులకు దేవుడే.
పేదల కష్టాలను తీర్చుతూ , సామాన్యుడు( Common Man ) తన బతుకు బండి సాఫీగా , ఏ చీకూ చింతా లేకుండా చేసిన జగన్ నిజంగా ప్రతి సామాన్యుడి హీరోనే.దటీజ్ జగన్.! శబాష్ జగన్ .!
జగన్ గురించి ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే .నేడు జగన్ పుట్టిన రోజు.( CM Jagan Birthday ) జగన్ ప్రవేశ పెట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారందరికీ ఇది పండుగ రోజే.
#telugustop.com# తరపున కూడా ఏపీ సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.