ఖాసీం సులేమానీ హత్యతో అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఇదే సమయంలో ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంగా మారిపోయింది.
ఈ క్రమంలో ఇరాన్ నుంచి దేశానికి ముప్పు పొంచివుందని ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలు తమ సంయుక్త ఇంటెలిజెన్స్ బులెటిన్‌లో హెచ్చరించాయి.ముఖ్యంగా అమెరికా సైబర్ స్పేస్‌పై దాడి చేయడానికి ఇరాన్ ప్రణాళికలు దాడి చేస్తోందని ఏజెన్సీలు తెలిపాయి.
గతంలో అమెరికాలో ఉగ్ర దాడులు, హత్యాయత్నాలు చేయించిన చరిత్ర ఇరాన్‌కు ఉందని ఆ బులెటిన్‌లో ప్రస్తావించారు.యూఎస్ సైనిక స్థావరాలు, చమురు, గ్యాస్ సౌకర్యాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవచ్చునని నివేదిక తెలిపింది.
దీనితో పాటు అమెరికాలో నివసించే, ఇరాన్ వ్యతిరేక శక్తులైన యూదు, ఇజ్రాయెల్, సౌదీ పౌరులపై ఎటువంటి హెచ్చరిక లేకుండా, ప్రతీకార చర్యలకు ఇరాన్ తన మద్ధతుదారులను రెచ్చగొట్టవచ్చని ఏజెన్సీలు అభిప్రాయపడ్డాయి.
కాగా అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశించి ప్రసంగించారు.తాము ఇరాన్‌పై మరోసారి ప్రతీకార దాడికి దిగమని, అదే సమయంలో ఆ దేశానికి అణుబాంబును చిక్కనివ్వమని ట్రంప్ స్పష్టం చేశారు.దీనిపై ఎఫ్‌బీఐ ప్రతినిధి స్పందిస్తూ.
మధ్యప్రాచ్యంలో ఇరాన్ అనుకూల శక్తులతో ముప్పు తప్పదని హెచ్చరించారు.ప్రస్తుతానికి అమెరికా దాని మిత్రదేశాలపై ఇరాన్ సైబర్ దాడులకు సన్నద్ధమవుతోందని యూఎస్ ఇంటెలిజెన్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఇరాన్ మద్ధతుగల హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ తరపున పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్ని కొందరినీ ఇటీవలి కాలంలో అమెరికన్ ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి.వాషింగ్టన్‌లో ఓ రెస్టారెంట్‌లో అమెరికాలోని సౌదీ రాయబారిపై 2011లో జరిగిన హత్యాయత్నాన్ని ఎఫ్‌బీఐ, హోమ్‌లాండ్ సెక్యూరిటీల బులెటిన్ ప్రస్తావించింది.