కొత్త తరహా ఐడియా.. రన్నింగ్ మెట్రో ట్రైన్‌లో ఫ్యాషన్ షో..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో( Nagpur ) ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.కదులుతున్న మెట్రో రైలులో( Metro Train ) అరుదైన ఘటన జరిగింది.

 Fashion Show In Moving Nagpur Metro Train Viral Details, New Idea, Fashion Show,-TeluguStop.com

రన్నింగ్ మెట్రో ట్రైన్‌లో ఫ్యాషన్ షో జరిగింది.ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఫ్యాషన్ షో అనగానే పెద్ద పెద్ద స్టేజీలు, హోటళ్లలో జరుగుతూ ఉంటాయి.కానీ మెట్రో రైళ్లల్లో ఫ్యాషన్ షోలు జరగడం ఏంటని ప్రయాణికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

నాగ్‌పూర్ మెట్రో ట్రైన్‌లో జరిగిన ఈ ఫ్యాషన్ షోకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Telugu Show, Shownagpur, Latest, Maharashtra, Metro Train, Nagpur, Idea-Latest N

వీకెండ్ కావడంంలో ఇటీవల మెట్రో రైళ్లు అన్నీ జనాలతో కిటకిటలాడిపోయాయి.ప్రయాణికుల రద్దీతో మెట్రో సందడిగా మారిపోయింది.ఈ క్రమంలో కదులుతున్న మెట్రో ట్రైన్ లో ఫ్యాషన్ షో( Fashion Show ) ప్రారంభం కావడంతో కాసేపు ప్రయాణికులకు ఏమీ అర్థం కాలేదు.2 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు.అలాగే వారితో పాటు పలువురు కూడా ఈ ఫ్యాషన్ షోలో పాల్గొని ప్రయాణికులను అలరించారు.

సెలబ్రేషన్స్ ఆన్ వీల్స్ అనే పథకాన్ని ఇటీవల నాగపూర్ మెట్రో ప్రారంభించింది.ఈ పథకం ద్వారా వివిధ సంస్థలు, వ్యక్తులు, సమూహాలు కొంత మొత్తం చెల్లించి వేడుకలు లేదా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతిస్తోంది.

Telugu Show, Shownagpur, Latest, Maharashtra, Metro Train, Nagpur, Idea-Latest N

అందులో భాగంగా ఒక సంస్థ కదులుతున్న మెట్రో రైలులోనే ఫ్యాషన్ షో నిర్వహించింది.ఒక్కసారి దీనిని చూసి మెట్రోలో ప్రయాణిస్తున్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు.ఏమవుతుందో వారికి కాసేపు అర్థం కాలేదు.ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు.మెట్రో ట్రైన్లలో జరిగిన ఈ ఫ్యాషన్ షో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.ప్రయాణికులను కూడా ఈ ఫ్యాషన్ షో సందడి చేసింది.

మెట్రో ట్రైన్ జర్నీలో కాసేపు ఫ్యాషన్ షో చేస్తూ మైమరిచిపోయారు.ఆగస్టు 28న ఈ ఫ్యాషన్ షో జరిగినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube