కేసీఆర్ వ్యూహానికి ఎమ్మెల్యే సీతక్క బలవుతుందా..?

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే లందరిలో సీతక్క( MLA SITAKKA ) బెస్ట్ ఎమ్మెల్యే అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అంటారు.ఎందుకంటే ఆమె డబ్బు, కాంట్రాక్టులు లాంటి వాటికి ఆశపడకుండా ప్రజల శ్రేయస్సే ప్రథమ ధ్యేయంగా ముందుకు సాగుతోంది.

 Will Mla Sitakka Be Strengthened By Kcr's Strategy , Brs Party , Cm Kcr , Sita-TeluguStop.com

అంతేకాకుండా ములుగు( MULUGU ) నియోజకవర్గంలో కరోనా సమయంలో ఆమె చేసిన సేవలు దేశవ్యాప్తంగా గుర్తించబడ్డాయి.అలాగే వరదల సమయంలో తనవంతుగా అందిన కాడికల్లా ప్రజల కోసం సహకారమందించింది.

అలాంటి ములుగు ఎమ్మెల్యే సీతక్క మరోసారి ములుగులో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది.అయితే ఈసారి సీతక్కని ఓడించేందుకు బీఆర్ఎస్ బడే నాగజ్యోతి అనే మహిళను ప్రత్యర్థిగా బరిలోకి దింపింది.

Telugu Bade Nagajyothi, Congress, Mla Sitakka, Mulugu-Politics

బడే నాగజ్యోతి ములుగు జడ్పీ వైస్ చైర్మన్ గా ప్రస్తుతం సేవలందిస్తోంది.అయితే నాగజ్యోతి ( NAGA JYOTHI ) ఫ్యామిలీ కూడా శీతక్క లాగే దళంలో నుంచి వచ్చిన ఫ్యామిలీ.ఆమె తల్లిదండ్రులు ఇద్దరు నక్సలైట్ ఉద్యమంలో పనిచేశారు.దీంతో నాగజ్యోతికి కూడా ములుగు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది.దీంతో ఆమెనే సీతక్కకు పక్కా పోటీ ఇవ్వగలరని భావించిన కేసీఆర్(KCR) వ్యూహంతో ఆమెను బీఆర్ఎస్ నుంచి బరిలోకి దింపుతున్నారు.నాగజ్యోతిని ఎలాగైనా గెలిపించుకోవాలని మంత్రులు, ఎంపీలు, పెద్ద పెద్ద నాయకులంతా ములుగు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు.

ప్రజల్లోకి వెళ్తున్నారు.

అందరి టార్గెట్ సీతక్కే అనే విధంగా కేసీఆర్ ఆలోచన విధి విధానాలతో ముందుకు సాగుతున్నారు.

అంతేకాకుండా బడే నాగజ్యోతి కూడా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ, తనకు సంబంధించిన ఆస్తులు తను బయోడేటా గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, సింపతిని పొందే విధంగా ముందుకు సాగుతోంది.అయితే ఇదే విషయంపై సీతక్క(SITHAKKA) కూడా స్పందించింది.

ఈ సమాజంలో పోటీ చేసే హక్కు ఎవరికైనా ఉంది.ములుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ నాపై అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారు.


నాకు ప్రజల బలం ఉంది అంటూ మాట్లాడింది.అంతేకాకుండా కరోణా సమయంలో కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ నేను ములుగు ప్రజలను కాపాడాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నాను.

ఎంతోమంది మంత్రులను కలిశాను అయినా ఏ ఒక్క మంత్రి కానీ నా నియోజకవర్గం వచ్చి చూసింది అయితే లేదు.నేను పార్టీలకతీతంగా నియోజకవర్గ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులను తీసుకువచ్చాను.

పూర్తయిన పనులను వారి ఖాతాలో వేసుకుంటూ, ఆగిపోయిన పనులను శీతక్క అసమర్ధత వల్లే ఆగిపోయాయంటూ నాపై రుద్దుతున్నారు.

Telugu Bade Nagajyothi, Congress, Mla Sitakka, Mulugu-Politics

వాళ్లు రుద్దినా నేను బాధపడను ఏది చేసినా ప్రజల కోసమే, కేవలం ఎన్నికల స్టంట్ కోసమే ప్రజల్లోకి వస్తున్న వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదని సీతక్క ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమైనా కేసీఆర్ సీతక్క( SITHAKKA ) లాంటి బలమైన ఎమ్మెల్యేని ఓడించడానికి అనేక వ్యూహాలు పన్నుతున్నారని చెప్పవచ్చు.మరి ఈ వ్యూహాలకు సీతక్క బలవుతుందా.? లేదంటే బరిగేసి నిలబడి గెలుస్తుందా.? అనేది ముందు ముందు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube