ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాల సంఖ్య పెరుగుతోంది.ప్రధానంగా సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులను టార్గెట్ గా చేసుకుని దొంగలు( Thieves ) దొంగతనానికి పాల్పడుతున్నారు.
ప్రముఖ బుల్లితెర నటీమణులలో ఒకరైన సుమిత్ర( Sumitra ) శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.టీవీ నటి సుమిత్ర ఈ నెల 17వ తేదీన ఢిల్లీకి వెళ్లారు.
సుమిత్ర ఫ్లాట్ తాళాలను అదే అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న సోదరుని కుటుంబంలో ఇచ్చి వెళ్లారు.
అయితే సుమిత్ర ఢిల్లీకి వెళ్లిన రోజు రాత్రి దొంగలు ఆమె ఇంట్లో బంగారు, వజ్రాభరణాలతో పాటు వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు.సోదరుని కుటుంబం ద్వారా దొంగతనం జరిగినట్టు సమాచారం అందుకున్న సుమిత్ర హైదరాబాద్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.1.2 కేజీల బంగారుఆభరణాలు 293 గ్రాముల వెండిని దొంగలు అహరించినట్లు తెలుస్తోంది.త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
ఇద్దరు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.ఫ్లాట్ మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఈ దొంగతనానికి పాల్పడ్డారని తెలుస్తోంది.క్లూస్ టీమ్( Clues Team ) దొంగలకు సంబంధించిన వేలి ముద్రలను సేకరించినట్లు బోగట్టా.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇతర సీజన్లతో పోల్చి చూస్తే సమ్మర్ సీజన్ లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం.ఎక్కువ రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చి ఊరికి వెళితే మంచిది.విలువైన ఆభరణాలు, డబ్బు బ్యాంక్ లాకర్ లో ఉంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.
ఇంటి బయట సీసీ కెమెరాలను ఫిక్స్ చేసుకుంటే మంచిదని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.మార్కెట్ లో ఇంట్లో ఎవరైనా ప్రవేశిస్తే తెలియజేసే కొన్ని గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి.