ప్రియురాలి మోజులో కన్న కొడుకుని చూడకుండా తండ్రి దారుణం..!

ఇటీవలే కాలంలో మనిషి కేవలం వివాహేతర సంబంధానికి మాత్రమే కట్టుబడి జీవిస్తూ సొంత కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నాడు.గత కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధానికి చెందిన దారుణాలు క్రమంగా పెరుగుతున్నాయి.

 The Father Is Cruel Not To See The Son Born On The Whim Of His Girlfriend , His-TeluguStop.com

ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన ముంబై నగరంలో( Mumbai ) చోటుచేసుకుంది.ప్రియురాలి మోజులో ఉన్న ఓ వ్యక్తి తన సొంత కొడుకుని చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపించి.

అతి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.దీంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు సమాచారం అందించడంతో ఆ తండ్రిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తే అసలు విషయం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబై నగరంలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి కాపురం ఉంటున్నాడు.

రెండు సంవత్సరాల కిందట ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు.అయితే ఆ వ్యక్తికి ఓ యువతితో పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది.

సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ తెగ ఎంజాయ్ చేసేవారు.చివరకు వీరిద్దరూ వివాహం చేసుకొని ఒకటవలనుకున్నారు.

కానీ ఆ యువతి వివాహం చేసుకోవాలంటే నీ భార్య, నీ కుమారుడు ప్రాణాలతో ఉండకూడదు అని ఓ కండిషన్ పెట్టింది.ఆ వ్యక్తి సరే అని ప్రియురాలికి మాట ఇచ్చి, పథకం ప్రకారం ముందుగా కుమారుడిని చంపాలని నిర్ణయించుకున్నాడు.

కుమారుడికి చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపించి బయటకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి శవాన్ని కవర్లో చుట్టి స్థానికంగా ఉండే చెరువులో పడేశాడు.

Telugu Girlfriend, Latest Telugu, Mumbai-Latest News - Telugu

కుమారుడు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేస్ నమోదు చేసి పోలీసులు చుట్టుపక్కల గాలించారు.ఓ చెరువులో ఆ బాలుడి మృతుదేహం కనిపించింది.దీంతో అందరిని విచారిస్తున్న క్రమంలో మృతుడి తండ్రి పై అనుమానం రావడంతో తమదైన శైలిలో పోలీసులు విచారణ జరిపితే అసలు నిజం బయటపెట్టాడు.

పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.ప్రియురాలి మోజులో సొంత కొడుకుని దారుణంగా హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube