తెలంగాణ కాంగ్రెస్ కూడా చేరికలపైనే దృష్టి సారించింది .ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్( Brs party ) , బిజెపిలను ఎదుర్కునేందుకు భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇప్పటికే బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలలోని అసంపూర్త నేతలను గుర్తించి వారితో మంతనాలు చేస్తున్నారు.మే మొదటి వారంలో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తున్నారు.
ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.
ఈ సభలోనే పెద్ద ఎత్తున చేరికలు ఉండే విధంగా చేయడం ద్వారా, పార్టీకి హైప్ తీసుకురావచ్చు అనే ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ ఉంది.ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఘర్ వాపసికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ లో చేరేందుకు కొంతమంది కీలక నాయకులు సముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో , మరింత ఉత్సాహంగా నియోజకవర్గాల వారీగా కీలక నేతలను గుర్తించి పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది.
బిజెపి, బీ ఆర్ ఎస్ లపై అసంతృప్తితో ఉన్న నేతలు ఎవరు అనే విషయం పైన లోతుగా ఆరా తీస్తూ, తమ పార్టీలో చేరితే రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో ప్రాధాన్యం కల్పిస్తామనే విషయాన్ని వారికి చెబుతూ, కాంగ్రెస్ లో చేరే విధంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivasa Reddy )తో పాటు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) లను కాంగ్రెస్ లో చేరే విధంగా ఒప్పించినట్లు సమాచారం.
వీరితో పాటు , క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల నాయకులను గుర్తించి వారిని కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు జిల్లాలు, నియోజకవర్గాల వారిగా కొంతమంది కాంగ్రెస్ కీలక నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం .ప్రియాంక గాంధీ( Priyanka Gandhi ) సభను సక్సెస్ చేసేందుకు భారీగా జన సమీకరణ చేపట్టడంతో పాటు, అంతే భారీగా చేరికలు ఉండేలా చూసుకోవడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ బలాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.గతంలో కాంగ్రెస్ లో కీలకంగా ఉండి, బీ ఆర్ ఎస్, బీజేపీ లలో చేరి ప్రస్తుతం ఇబ్బందులు పడుతూ అసంతృప్తితో ఉన్న నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకునే విధంగా ఘర్ వాపసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట.