చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.అక్కడ నారా లోకేశ్ బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది.
అయితే టీడీపీ బహిరంగ సభకు పోలీసులు అనుమతి లేదని చెబుతున్నారు.ఈ క్రమంలోనే పాదయాత్రలో నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.సభకు పోలీసులు ససేమిరా అనడంతో లోకేశ్ అక్కడ ఓ భవనంపైకి ఎక్కి మాట్లాడుతున్నారు.