రసమయి బాలకిషన్ అబద్దాల కొరు - మాజీ సర్పంచ్ గుండ వెంకటేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జీపూర్ గ్రామంలో మంగళవారం రోజున మానకొండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు.ప్రచారంలో భాగంగా మాజీ సర్పంచ్ గుండ వెంకటేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం అయిందని అన్నారు.

 Ex Sarpanch Gunda Venkatesam Shocking Comments On Rasamayi Balakishan, Ex Sarpan-TeluguStop.com

గ్రామపంచాయతీ భవనం, మహిళాశక్తి భవనం, యాదవ సంఘం కాంగ్రెస్ పార్టీ హయాములోనే నిర్మాణం అయ్యాయని అన్నారు.

మొన్నటి ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన ఎమ్మెల్యే రసమయి మాట్లాడినవి అన్ని పచ్చి అబద్ధాలే అని ఆయన అన్నారు.

వెల్జీపూర్ లో ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ రాలేదని,రసమయి తన స్థాయి మరచి ఒంటెత్తు పోకడలతో వెళుతున్నారని,ఈ సారి రసమయిని ఓడించి తీరుతామని అన్నారు.గతంలో తాను చేసిన అభివృద్ధి పనులకు రసమయి దగ్గరికి వెళ్లి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదని,బిల్లులు రాలేక అప్పుల పాలు అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube