దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శర వేగంగా వ్యాపిస్తుంది.రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఈ వైరస్ బారినపడి ఎంతోమంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు .మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అంతేకాక అనేక మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.తినడానికి తిండి కూడా లేక నానా అవస్థలు పడుతున్నారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఓ కంపెనీ ఉద్యోగులకు కుటుంబాలకు అండగా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
కోల్ ఇండియా తాజాగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి రూ.15 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.అయితే కంపెనీ బోర్డు కరోనా ఎక్స్‌గ్రేషియా నిర్ణయానికి ఆమోదం తెలియజేసిందని తెలిపారు.
ఇక కోల్ ఇండియా కంపెనీలో సుమారు 4 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు.అయితే కోల్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.కోల్ ఇండియా లేదా దానికి సంబంధించిన అనుబంధ సంస్థల్లో పని చేసే కార్మికులకు వర్తిస్తుంది అని తెలిపారు.కరోనా కారణంగా మరణిస్తే వారి కుటుంబాలకు రూ.15లక్షలు అందజేస్తారని తెలిపింది.అయితే మార్చి 24 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని కంపెనీ తెలిపారు.
కరోనా వైరస్ కారణంగా కోల్ ఇండియా కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు ఏమైనా చనిపోతే వాటిని ప్రమాదంగా భావిస్తామని తెలిపారు.అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద జోషి తెలిపారు.
ఈ క్రమంలోనే కంపెనీ కుడా కరోనా మరణాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.