ప్రపంచంలోని అన్ని దేశాలను కరోనా వైరస్ ఏ స్థాయిలో వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.గత ఏడాది చైనాలోని వూహన్ నగరంలో పురుడుపోసుకున్న ఈ మహమ్మారి.
ప్రస్తుతం ప్రపంచదేశాలను తన కనుసైగలతో శాసిస్తూ ప్రజలను ముప్పతిప్పలు పెడుతోంది.ఈ మహమ్మారిని నాశనం చేసే సరైన వ్యాక్సిన్ కూడా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు.
దీంతో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి.అయితే కరోనా వేగంగా విజృంభిస్తున్న వేళ.అవగాహన లేని కొందరు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఇరకాటంలో పడుతున్నారు.తాజాగా నార్త్ టెక్సాస్‌లో కరోనా చస్తుందని బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిని తాగేస్తున్నారు.

ప్రస్తుతం కరోనా రోగుల ఇంట్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మున్సిపాలిటీ అధికారులు బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిని తాగితే.శరీరంలో కరోనా చస్తుందని నార్త్ టెక్సాస్‌లో ప్రచారం స్టాట్ చేశారు.అది గుడ్డిగా నమ్మిన పలువురు.కరోనా నుంచి రక్షణ పొందేందుకు బ్లీచింగ్ పౌడర్ నీటిని తాగారు.
చివరకు తీవ్ర అస్వస్థతకు గురై హాస్పటల్ పాలయ్యారు.
దీంతో వెంటనే స్పందించిన అధికారులు.ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
బ్లీచింగ్ పౌడర్ నీరు తాగడం వల్ల కరోనా చావకపోగా.వాంతులు, విరేచనాలు, లివర్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.