Viral Video: ఏనుగుకు వదిలేయమంటూ దణ్ణం పెట్టడంతో బతికిపోయిన వారందరూ..!

సోషల్ మీడియా( Social Media )లో ప్రతిరోజు జంతువులకి సంబంధించిన అనేక వైరల్ వీడియోలు మనం గమనిస్తూనే ఉంటాం.ఇందులో కొన్ని జంతువులు నవ్వును తెప్పిస్తే మరికొన్ని భయభ్రాంతులకు లోనయ్యే విధంగా ఉంటాయి.

 Elephant Picks Up And Throws Truck Full Of Tourists Viral Video-TeluguStop.com

జంతువులు ఏ సమయంలో ఎలా ఉంటాయో అసలు ఊహించడం కష్టమే.ముఖ్యంగా అడవుల్లో ఉండే ఏనుగులకు( Elephants ) తిక్క లేస్తే మాత్రం ముందర ఎవరున్నా సరే తొక్కి పడేస్తుంది.

ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోకి సంబంధించిన వివరాలు చూస్తే.

Telugu Elephant, Elephantthrows, Latest-Latest News - Telugu

వీడియోను గమనించినట్లయితే కొందరు టూరిస్టులు( Tourists ) ఓ ట్రక్ తీసుకోని సఫారీ కోసం అడవిలోకి వెళ్తారు.దాని మధ్యలో వారికి ఓ పెద్ద మగ ఏనుగు ఎదురవుతుంది.ఆ ఏనుగు మొదటగా ప్రశాంతంగానే ఉన్నట్లు అనిపించిన., ఆ తర్వాత ఎందుకో తెలియదు ఒక్కో అడుగు వేస్తూ మరోపక్కకు నడిచింది.అయితే ఏనుగు ఆలోచనలను ముందుగానే ప్రతి పెట్టిన డ్రైవర్( Driver ) ఏనుగు పై పెద్దగా అరుస్తూ దాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు.అంతేకాదు అదే సమయంలో వాహనం కూడా తిప్పే ప్రయత్నం చేశాడు.

Telugu Elephant, Elephantthrows, Latest-Latest News - Telugu

ఈ సమయంలో ఏనుగు ట్రక్కు ఎదురుకు వచ్చేసింది.అయినా గాని డ్రైవర్ గట్టిగా అరుస్తూ దాన్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశాడు.దాంతో ఏనుగు ఓ రెండు అడుగులు వెనక్కి వేసినట్టే వేసి మళ్లీ ముందుకు వచ్చి ట్రక్కు( Truck )ను ఏనుగు దంతాలతో పైకెత్తింది.దాంతో వాహనంలో ఉన్న వారందరూ పెద్దగా అరిచారు.

అయితే అలా పైకెత్తిన ఏనుగు ఒక్కసారిగా ట్రక్కును వదిలేసింది.దాంతో పెద్ద శబ్దంతో కింద పడింది.

ఇలా ఏనుగు మరోసారి కూడా ట్రక్కుని ఎత్తి కింద పడేసింది.దీంతో ఏనుగు దాటికి భయపడిన డ్రైవర్ వదిలేయమంటూ ఏనుగుకు నమస్కరించాడు.

అయితే ఇది చూసిన ఏనుగు ఏమనుకుందో ఏమో కానీ ట్రక్ ను వదిలేసి వెనక్కి వెళ్ళిపోయింది.ఈ వీడియో( Viral Video ) చూసిన కొందరు డ్రైవర్ నమస్కరించకపోయి ఉంటే మాత్రం మీ ప్రాణాలు గాల్లో కలిసేవి అంటూ కామెంట్ చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube