క్యాసినో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ పలువురు కీలక వ్యక్తులు ఈడీ ఎదుట హాజరుకానున్నారు.
ఈ క్రమంలోనే ఎల్.రమణ, డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డిలు విచారణకు హాజరవుతారని సమాచారం.ఇప్పటికే ఈ కేసులో తలసాని సోదరులను ఈడీ అధికారులు విచారించారు.ఊర్వశి రెస్టారెంట్ యజమాని యుగంధర్ ను సైతం అధికారులు ప్రశ్నించారు.ఫెమా నిబంధనలు, మనీ లాండరింగ్, హవాలా చెల్లింపులపై ఆరా తీయనున్నారు.కాగా ఈడీ జాబితాలో మరో వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది.