క్యాసినో వ్యవహారం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను వేగవంతం చేసింది.ఇందులో భాగంగా పలువురు రాజకీయ ప్రముఖులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు అందించింది.వీరి ఇద్దరు రేపు, ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.హవాలా, ఫెమా నిబంధనలు ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో తలసాని మహేశ్ యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్ లు ఈడీ ఎదుట హాజరైయ్యారు.