మునుగోడు ఉపఎన్నికలో ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది.రిజిస్టర్ పార్టీలు, స్వతంత్రులకు గుర్తులను కేటాయించింది.
ఈ నేపథ్యంలో కేఏ పాల్ కు రింగు గుర్తు ఈసీ అధికారులు కేటాయించారు.మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ చీఫ్ గా ఒక నామినేషన్, స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలు చేశారు.
అయితే ప్రజాశాంతి పార్టీ అధినేత నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.మరోవైపు టీఆర్ఎస్ తమ పార్టీ గుర్తు కారును పోలి ఉన్న గుర్తులను తొలగించాలని ఇప్పటికే ఈసీని కోరింది.