ఒత్తిడి త్వ‌ర‌గా త‌గ్గించే సులభ ఉపాయాలు.. ఆచరిస్తే బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌యోజ‌నం

అధిక ఒత్తిడి కారణంగా, గుండెపోటు, స్ట్రోక్ లేదా డిప్రెషన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.అందుకే ఒత్తిడి ప్రభావాలకు దూరంగా ఉంటూ, ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం.

 Easy Tips To Reduce Stress Quickly Awesome Benefit Of Practice , Stress, Activi-TeluguStop.com

అందుకు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని, వదులుతున్నప్పుడు, మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది, ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివ్ చేస్తుంది.

హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది.దీని వల్ల మనకు ప్రశాంతంగా ఉన్న భావన కలుగుతుంది.

ఈ ప్రక్రియ ఇది మన చూపును కూడా పెంచుతుంది.ఒత్తిడి నుండి తక్షణ ఉపశమనం పొందడానికి మీరు కొద్దిసేపు నడవండి.

ఈ నడక మిమ్మల్ని రిఫ్రెష్ చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.అయితే మీరు పార్క్ లేదా గార్డెన్‌లో పచ్చని గడ్డిపై నడిస్తే మంచిది.మీరు ఒత్తిడి కారణంగా ప్రశాంతతక దూరమైతే,, మనసును ప్రశాంతపరిచే శక్తి సంగీతానికి ఉందని తెలుసుకోండి.10 నిమిషాల పాటు ఏదైనా మంచి సంగీతాన్ని వినవచ్చు.

ఆఫీసులో ఉంటే కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇలాంటి మ్యూజిక్ వినొచ్చు.మనం ఒత్తిడికి లోనైనప్పుడు మన శరీరంలోని కండరాలు కూడా బిగుతుగా మారుతాయి.అటువంటి పరిస్థితిలో మీరు ఒక బంతిని తీసుకొని పదేపదే నొక్కితే.ఈ పునరావృత కదలిక రక్తపోటును తగ్గిస్తుంది.

మన దృష్టిని, సృజనాత్మకతను మెరుగుపరుస్తుంది.మీరు ఏదైనా పని మధ్యలో ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, మీరు 2 నిమిషాలపాటు ఆగి లోతైన శ్వాస తీసుకోండి.

కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.ఆవిరి పీల్చడం అనేది ఒత్తిడిని తగ్గించడానికి సులభమైన, ప్రభావవంతమైన మార్గం.

సాధారణ నీటితో ఆవిరి తీసుకోవడం లేదా ఏదైనా సువాసన నూనెను జోడించడం ద్వారా మీరు రిఫ్రెష్‌గా మారుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube