ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తో అనేక ఇబ్బందులు పడుతున్న కానీ, అభివృద్ధి మాత్రం ఎక్కడ తగ్గడం లేదు.తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఆధునిక టెక్నాలజీతో మరో రెండు భారీ ఆకాశ మార్గాలు రాబోతున్నట్లు తెలుస్తోంది.
రాబోయే ఐదు సంవత్సరాల్లో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండు అంతస్తుల్లో రోడ్డు ఫ్లై ఓవర్ కం మెట్రో కారిడార్ తో స్కైవేల అ నిర్మాణానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ నిర్మాణాలు సికింద్రాబాద్ దగ్గర లోని జూబ్లీ బస్టాండ్ దగ్గర నుండి ప్యారడైస్ – శామీర్ పేట – కొంపల్లి – ఆర్ ఓబి వరకు రెండు అంతస్తుల్లో నిర్మాణానికి తెలంగాణ అధికారులు ప్రణాళికలు రూపొందించబోతున్నారు.
ఈ స్కైవే కు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం అవ్వగా, మరో స్కైవే నిర్మాణానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు.అయితే ఇందుకోసం ఏకంగా నిర్మాణానికి 5 వేల కోట్ల వరకు అంచనా వేస్తున్నారు అధికారులు.
ఈ నిర్మాణాలను పూర్తిగా హెచ్ఎండిఎ నే పనులు చేపట్టనుంది.

ప్రస్తుతం అనుకున్న దారులలో ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా సికింద్రాబాద్ నుండి ఈ పనులు మొదలు పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనులు మొదలు పెట్టబోతోంది.ఇక ఈ క్రమంలోని మొదటగా జూబ్లీ బస్టాండ్ నుండి శామీర్ పేట వరకు ఏకంగా 18.5 కిలోమీటర్ల మేర రెండంతస్తుల నిర్మించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు.ఇక ఆ తర్వాత ప్యారడైజ్ నుండి కొంపల్లి తర్వాత వచ్చే ఆర్ ఓబి వరకు ఏకంగా 18.35 కిలోమీటర్ల వరకు ఈ డబుల్ డెక్కర్ స్కైవే ను నిర్మించడానికి సాధ్యాసాధ్యాలపై సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించనున్నారు.